Etela Rajender : నీకూ కొడుకు, బిడ్డ ఉన్నారు.. వావి వరసలు తెలియవా కేసీఆర్? ఈటల సంచలన వ్యాఖ్యలు?
Etela Rajender : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ గురించే చర్చ. మొన్నటి నుంచి ఆయన అధికారాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ… ఈటలను ఒంటరిగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మెదక్ జిల్లాలోని అచ్చంపేటలో ఉన్న 100 ఎకరాల అసైన్డ్ భూముల కబ్జా వ్యవహారంపై ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆయనపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించడంతో… అధికారులు ఆ భూమిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా అందించారు. దీనిపై మీడియాలో కథనాలు కూడా ప్రసారం అయ్యాయి.
ఇప్పటికే ఒకసారి ప్రెస్ మీట్.. తనే తప్పు చేయలేదని… తనను కావాలని ఇరికిస్తున్నారని.. అన్నీ కట్టుకథలు అల్లారని ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించినా… ప్రభుత్వం నుంచి ఈటలకు ఎటువంటి విచారణకు సంబంధించిన పిలుపు రాకపోవడంతో పాటు… ఆయన వద్ద ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేయడంతో పాటు.. మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
దీంతో మరోసారి ఈటల రాజేందర్.. ప్రజల ముందుకు వచ్చారు. మరోసారి మీడియాతో మాట్లాడారు. ఎందుకు తనపై ఇంతలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఈటల ప్రశ్నించారు. నేను తప్పు చేస్తే.. ఒక్కసారైనా నాతో మాట్లాడొచ్చు కదా. ఇప్పటి వరకు నన్ను పిలవకుండా.. నాతో కన్సల్ట్ కాకుండా.. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు. నేను నా సొంత భూమిలో ఫౌల్ట్రీ ఫామ్ కట్టుకుంటున్నా. నాది కాని భూములను కొలిచాలి. జమునా హ్యాచరీస్ నాది కాదు. అయినా కూడా నాది అన్నారు. దాన్ని ప్రొప్రైలర్ నితిన్. మీకు వావి వరసలు తెలియవా కేసీఆర్? నీకు కొడుకు ఉన్నాడు కదా.. నీకూ కూతురు ఉన్నది కదా.. ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్.. అంటూ ఈటల దుయ్యబట్టారు.
Etela Rajender : మానవ సంబంధాలే గొప్పవి ముఖ్యమంత్రి గారూ
మానవ సంబంధాలే ముఖ్యం ఈరోజుల్లో. తెలంగాణ భవన్ ను ఆక్రమించుకుంటా అని వైఎస్సార్ మనుషులను పంపిస్తే.. మీకు మేం కాపలా కాశాం. ఆ విషయాన్ని మరిచిపోయారు మీరు ముఖ్యమంత్రి గారు. మానవ సంబంధాలు చాలా ముఖ్యం. మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు, ఉక్కుపాదం మోపుతున్నప్పుడు మీకు నా మీద ఎంత అనుబంధం ఉంది.. మీరు పిలుపు ఇచ్చారని.. అసెంబ్లీలో నేను ఏం చేశానో.. అమ్ముడుపోకుండా నేను కొట్లాడిన విషయం మీకు గుర్తుకు రావాలి కదా. నా ఆస్తుల మీద, నా సంపాదన మీద.. మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. దానికి నేను సిద్ధం. ఇప్పుడు నేను ఒక్కడినే కావచ్చు కానీ… తెలంగాణ ప్రజలు మాత్రం నాతో ఎప్పటికీ ఉంటారు. నాకు మంత్రి పదవి కంటే ఆత్మగౌరవం ముఖ్యం.. అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొండి. మీరు మమ్మల్ని ఏనాడూ మంత్రులుగా చూడలేదు. అయినా కూడా మేం ఏం అనలేదు. కనీసం మనుషులుగా అయినా మమ్మల్ని చూడండి అని వేడుకుంటున్నా… అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.