etela rajender speech about the case on him
Etela Rajender : తెలంగాణ లో ఒక పక్క కరోనా ప్రతాపం చూపిస్తుంటే మరో పక్క తెరాస పార్టీలో రాజకీయ లుకలుకలు బయటపెట్టాయి. పార్టీలోని సీనియర్ నేత పార్టీ పెట్టిన నాటి నుండి కేసీఆర్ వెన్నంటి ఉంది, ఎన్నో పోరాటాలు చేసిన మినిష్టర్ ఈటెల రాజేందర్ పై భూకబ్జా కేసు నమోదు కావటం, దానిపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించటం, ఆ విచారణ ఫలితం తేలకముందే ఈటెలను వైద్య ఆరోగ్య శాఖ నుండి తప్పించటం చక చక జరిగిపోయాయి.
etela rajender speech about the case on him
తనను వైద్య శాఖ నుండి తప్పించిన తర్వాత ఈటెల మాటల్లో సృష్టమైన తేడా కనిపిస్తుంది. ఒక రకమైన హెచ్చరికలు చేస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాడు. తనపై జరిగిన కుట్రకు భారీ మూల్యం చెల్లించుకుంటారు అని, త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని పరోక్షంగా చెప్పటం జరిగింది. ఈటెల రాజేందర్ ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం..
పార్టీలో ఒక్కటే కొట్లాడాడు. 20 ఏళ్లుగా పార్టీని పట్టుకొని ఏడ్చాడు. అలాంటి ఈటలకే ఈ గతి పట్టింది. ఈ పరిణామం మంచిది కాదనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంది. 20 ఏళ్లలో చేయని తప్పుల్ని, ఇప్పుడు చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? ఉద్యమం టైమ్ లో రాజకీయ ప్రలోభాలకే లొంగని నేను, ఇప్పుడు తప్పుచేస్తానా? ఇవన్నీ ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కంప్లయింట్ ఇచ్చిన తర్వాత ఎంక్వయిరీ జరిగి న్యాయం-అన్యాయం తేల్చకుండా.. ముందుగానే అన్నీ ఫిక్స్ చేసి జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
etela rajender speech about the case on him
ప్రస్తుతానికి నేనింకా పూర్తిస్థాయిలో అప్ డేట్స్ తెలుసుకోలేదు. నాపై ఎవరు కుట్ర చేస్తున్నారనే విషయం కచ్చితంగా తెలుసుకుంటాను.నాపై ఇంత కుట్ర జరుగుతుందనే విషయం నాకు తెలుసు. నేను రోజూ కరోనా నివారణ చర్యలు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాను. అందుకే దృష్టి పెట్టలేదు. నిన్నట్నుంచి ఏవేవో జరుగుతున్నాయి. ఇవన్నీ విశ్లేషించి ఓ నిర్ణయం తీసుకుంటాను. నా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాను. ఈ పరిస్థితుల్లో ఇంకా ఏమైనా పరిణామాలు ఉత్పన్నమైతే, కార్యకర్తలతో చర్చించి మాట్లాడతా. ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నాపై జరుగుతున్న ఈ కుట్రలకు భవిష్యత్తులో కచ్చితంగా మూల్యం ఉంటుంది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.