వార్నింగ్ లు ఇస్తున్న ఈటెల.. ఇక రణరంగమే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

వార్నింగ్ లు ఇస్తున్న ఈటెల.. ఇక రణరంగమే

Etela Rajender : తెలంగాణ లో ఒక పక్క కరోనా ప్రతాపం చూపిస్తుంటే మరో పక్క తెరాస పార్టీలో రాజకీయ లుకలుకలు బయటపెట్టాయి. పార్టీలోని సీనియర్ నేత పార్టీ పెట్టిన నాటి నుండి కేసీఆర్ వెన్నంటి ఉంది, ఎన్నో పోరాటాలు చేసిన మినిష్టర్ ఈటెల రాజేందర్ పై భూకబ్జా కేసు నమోదు కావటం, దానిపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించటం, ఆ విచారణ ఫలితం తేలకముందే ఈటెలను వైద్య ఆరోగ్య శాఖ నుండి తప్పించటం చక చక […]

 Authored By brahma | The Telugu News | Updated on :2 May 2021,2:00 pm

Etela Rajender : తెలంగాణ లో ఒక పక్క కరోనా ప్రతాపం చూపిస్తుంటే మరో పక్క తెరాస పార్టీలో రాజకీయ లుకలుకలు బయటపెట్టాయి. పార్టీలోని సీనియర్ నేత పార్టీ పెట్టిన నాటి నుండి కేసీఆర్ వెన్నంటి ఉంది, ఎన్నో పోరాటాలు చేసిన మినిష్టర్ ఈటెల రాజేందర్ పై భూకబ్జా కేసు నమోదు కావటం, దానిపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశించటం, ఆ విచారణ ఫలితం తేలకముందే ఈటెలను వైద్య ఆరోగ్య శాఖ నుండి తప్పించటం చక చక జరిగిపోయాయి.

etela rajender speech about the case on him

etela rajender speech about the case on him

తనను వైద్య శాఖ నుండి తప్పించిన తర్వాత ఈటెల మాటల్లో సృష్టమైన తేడా కనిపిస్తుంది. ఒక రకమైన హెచ్చరికలు చేస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాడు. తనపై జరిగిన కుట్రకు భారీ మూల్యం చెల్లించుకుంటారు అని, త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని పరోక్షంగా చెప్పటం జరిగింది. ఈటెల రాజేందర్ ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం..

పార్టీలో ఒక్కటే కొట్లాడాడు. 20 ఏళ్లుగా పార్టీని పట్టుకొని ఏడ్చాడు. అలాంటి ఈటలకే ఈ గతి పట్టింది. ఈ పరిణామం మంచిది కాదనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంది. 20 ఏళ్లలో చేయని తప్పుల్ని, ఇప్పుడు చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? ఉద్యమం టైమ్ లో రాజకీయ ప్రలోభాలకే లొంగని నేను, ఇప్పుడు తప్పుచేస్తానా? ఇవన్నీ ఓ పథకం ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కంప్లయింట్ ఇచ్చిన తర్వాత ఎంక్వయిరీ జరిగి న్యాయం-అన్యాయం తేల్చకుండా.. ముందుగానే అన్నీ ఫిక్స్ చేసి జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

etela rajender speech about the case on him

etela rajender speech about the case on him

ప్రస్తుతానికి నేనింకా పూర్తిస్థాయిలో అప్ డేట్స్ తెలుసుకోలేదు. నాపై ఎవరు కుట్ర చేస్తున్నారనే విషయం కచ్చితంగా తెలుసుకుంటాను.నాపై ఇంత కుట్ర జరుగుతుందనే విషయం నాకు తెలుసు. నేను రోజూ కరోనా నివారణ చర్యలు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాను. అందుకే దృష్టి పెట్టలేదు. నిన్నట్నుంచి ఏవేవో జరుగుతున్నాయి. ఇవన్నీ విశ్లేషించి ఓ నిర్ణయం తీసుకుంటాను. నా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాను. ఈ పరిస్థితుల్లో ఇంకా ఏమైనా పరిణామాలు ఉత్పన్నమైతే, కార్యకర్తలతో చర్చించి మాట్లాడతా. ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నాపై జరుగుతున్న ఈ కుట్రలకు భవిష్యత్తులో కచ్చితంగా మూల్యం ఉంటుంది.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది