Ayyanna Patrudu : బ్రేకింగ్.. టీడీపీకి అయ్యన్న పాత్రుడు రాజీనామా?
Ayyanna Patrudu : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మళ్లీ టీడీపీ జుట్టు దొరికిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకే ఆయన మళ్లీ పార్టీలో చక్రం తిప్పే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆయన చాలా రోజుల నుంచి పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పార్టీ నుంచి దూరం అయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. చివరకు ఎమ్మెల్యే అయినా కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన సొంత నియోజకవర్గంలోనూ ఆయన అంతగా యాక్టివ్ గా లేరు.
వైజాగ్ లో అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య వర్గపోరు ఉన్న విషయం తెలిసిందే. ఆయన యాక్టివ్ గా లేకపోవడంతో తాము యాక్టివ్ అవుతామని అనుకున్నారు. కానీ.. గంటా తిరిగి యాక్టివ్ కావడంతో అయ్యన్న పాత్రుడి వర్గానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు అయ్యన్న టీమ్ సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. చంద్రబాబు కూడా గంటా శ్రీనివాసరావు వర్గాన్ని దగ్గరికి తీశారు. మరోవైపు గంటా పార్టీ మారుతారని అంతా అనుకున్నారు. వైసీపీ నుంచి ఆయనకు బంఫర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
Ayyanna Patrudu : గంటా పార్టీ మారడం లేదా?
కానీ.. అక్కడికి వెళ్లకుండా అవంతి శ్రీనివాసరావు గంటాను అడ్డుకున్నట్టు సమాచారం. అందుకే.. ఆయన వైసీపీలో చేరకుండా ఆగిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికలు దగ్గరపడటంతో చేసేది లేక టీడీపీలోనే యాక్టివ్ కావాలని గంటా భావిస్తున్నట్టు తెలుస్తోంది. గంటాకు ప్రాధాన్యం ఇవ్వడంతో అయ్యన్న పాత్రుడి వర్గం డీలా పడినట్టు తెలుస్తోంది. ఆయనకు ప్రాధాన్యత వచ్చాక.. తమ పరిస్థితి ఏంటి అని అయ్యన్నపాత్రుడి వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి భవిష్యత్తులో అయ్యన్నపాత్రుడి వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.