Refined Folwer | మైదా.. నిశ్శబ్దంగా చంపే విషం ..షుగర్, బరువు పెరుగుదలతో పాటు ప్రాణాపాయం కూడా
Refined Folwer | మైదా పదార్థాలు రుచిగా ఉంటాయని చాలా మంది ప్రతిరోజూ తింటూ ఉంటారు. కానీ నిపుణులు చెబుతున్న హెచ్చరిక మాత్రం భయంకరంగా ఉంది. తరచూ మైదా తినడం వలన దీర్ఘకాలంలో డయాబెటిస్ (షుగర్) వచ్చే ప్రమాదం బలంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే షుగర్ ఉన్నవారికి మైదా మరింత ప్రమాదకరమని, అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి ప్రాణాపాయం తెచ్చే పరిస్థితులు సృష్టించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
#image_title
నిపుణుల సలహా
మైదా అనేది అధికంగా ప్రాసెస్ చేయబడిన పిండి పదార్థం. దీన్ని తరచుగా తీసుకోవడం వలన శరీరంలో ఇన్సులిన్ నిరోధకత (insulin resistance) పెరుగుతుంది. దాంతో శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను కణాలు సరిగ్గా ఉపయోగించలేవు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది.
అంతేకాకుండా, మైదా తిన్న వెంటనే ఆకలి తీరదు. దీంతో మనం అవసరానికి మించి ఆహారం తీసుకుంటాం. దీని వలన శరీరంలో శక్తి తగ్గిపోవడం, అలసట, ఒత్తిడి, మూడ్ మార్పులు వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో ఇవి హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి గుండె సంబంధిత సమస్యలకూ కారణం అవుతాయి.
మైదాతో తయారైన పూరీలు, కేకులు, బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్‌ను వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. వాటికి బదులుగా పండ్లు, నట్స్, విత్తనాలు తీసుకోవడం ఉత్తమం. ఇవి ఆకలిని నియంత్రించడంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.