Eye Twitching | కనురెప్పలు కొట్టుకోవడం వెనుక అర్థం ఏమిటి? సైన్స్, జ్యోతిష్యం ఏమి చెబుతున్నాయో తెలుసుకోండి!
Eye Twitching | మనలో చాలామందికి తరచూ కనురెప్పలు (లిద్స్ లేదా ఐలిడ్) తేలికగా కొట్టుకుంటూ ఉంటాయి. కొంతమందికి ఇది సాధారణ సమస్యగా అనిపించవచ్చు. కానీ దీనిపై వైద్య శాస్త్రం (సైన్స్) ఒక వైపు స్పష్టమైన కారణాలు చెబుతుంటే, మరోవైపు జ్యోతిష్య శాస్త్రం మాత్రం దీన్ని శుభ, అశుభ సంకేతాలుగా భావిస్తుంది.
#image_title
ఈ రెండు కోణాలనూ ఒకసారి పరిశీలిద్దాం…
సైన్స్ ప్రకారం కారణాలు
వైద్య నిపుణుల వివరాల ప్రకారం, కనురెప్పలు తరచూ కొట్టుకోవడానికి ఇవే ప్రధాన కారణాలు:
తీవ్రమైన ఒత్తిడి (Stress): మానసిక ఒత్తిడికి శరీరమే ఇలా ప్రతిస్పందించవచ్చు.
నిద్రలేమి: శరీరానికి తగిన విశ్రాంతి అందకపోతే, కనురెప్పల కదలికలు ఏర్పడతాయి.
కాఫీ ఎక్కువగా తీసుకోవడం: క్యాఫిన్ మోతాదుతో నర్వస్ సిస్టమ్ స్పందన పెరిగి ఈ లక్షణం కనిపించవచ్చు.
ఐ స్ట్రెయిన్ / స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం
బాహ్య కారకాలు: దుమ్ము, ధూళి, అలెర్జీ కారణంగా కూడా కనురెప్పలు కదలగలవు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంకేతాలు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కనురెప్పలు కొట్టుకోవడం శరీర సంకేతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది స్త్రీ, పురుషులకు వేర్వేరు ఫలితాలను సూచిస్తుంది.
స్త్రీలకు:
ఎడమ కన్ను కొట్టుకోవడం – శుభప్రదం. కొత్త బట్టలు, స్నేహితులు, ప్రయాణం, భాగస్వామితో హ్యాపీ మూమెంట్లు అని అర్థం.
వివాహిత స్త్రీకి కుడి కన్ను – అశుభ సంకేతం. వచ్చే రోజులలో కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచన.
కన్యగా ఉన్న స్త్రీకి కుడి కన్ను – విజయ సూచిక. కెరీర్‌లో గుడ్ న్యూస్, వివాహ సూచనలు రావచ్చు.
పురుషులకు:
కుడి కన్ను కొట్టుకోవడం – శుభసూచకము. అదృష్టం పలికే అవకాశం, ఏదైనా సంతోషకర సంఘటన జరగొచ్చు.
ఎడమ కన్ను కొట్టుకోవడం – చింతించదగ్గ సంకేతం. సమస్యలు ఎదురవ్వవచ్చు. ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి.