Dhee Dance Show : ఈటీవీలో నిన్న మొన్నటి వరకు జబర్దస్త్, ఢీ, క్యాష్, శ్రీదేవి డ్రామా కంపెనీలు టాప్ రేటెడ్ షో లుగా పేరు దక్కించుకునేవి. వాటి వల్లే ఈటీవీ ప్రస్థానం కొనసాగుతుంది అనే వారు కూడా ఉన్నారు. నిజంగానే కేవలం ఆ షో ల వల్ల ఈటీవీకి మంచి రేటింగ్ వస్తూ ఉండేది. అలాంటి షో లను ఎందుకు ఈటీవీ వారు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ ను చేజేతులా నాశనం చేశారు అంటూ విమర్శలు వస్తున్నాయి. విషయం లో కొందరు మల్లెమాల వారిని కూడా తప్పుబడుతున్నారు. ఇప్పుడు ఢీ పరిస్థితి కూడా అలాగే ఉంది.
ఢీ షో ను చాలా మంది డాన్స్ కోసం కాకుండా కామెడీ కోసం చూడటం మొదలు పెట్టారు. మొదట్లో సుధీర్ మరియు ప్రదీప్ ల మద్య కెమిస్ట్రీ బాగుండేది. వారిద్దరి వల్ల మంచి ఫన్ జెనరేట్ అయ్యేది. తద్వారా షో కు మంచి రేటింగ్ దక్కేది. ఇప్పుడు కూడా అదే కామెడీ కోసం అంటూ హైపర్ ఆది చేస్తున్న ప్రయత్నం విరక్తి పుట్టిస్తోంది. బాబోయ్ ఇదేం నీచంరా నాయన అంటూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఢీ షో ను నాశనం చేస్తున్నారు. ఒక పద్దతి పాడు లేకుండా కామెడీ పేరుతో విసిగిస్తున్నారు అనేది చాలా మంది అభిప్రాయం గా తెలుస్తోంది. ఢీ షో పై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది.
మొన్నటి ఎపిసోడ్ లో రష్యన్ అమ్మాయి మరియు నిఖిల్ వచ్చి ఎంటర్ టైన్‌మెంట్ ను ఇవ్వాలి అనుకుని ప్రేక్షకులకు తలనొప్పిని ఇచ్చారు. రష్యన్ అమ్మాయిని తీసుకు వచ్చిన నిఖిల్ తన స్నేహితురాలు అన్నట్లుగా పరిచయం చేశాడు. ఆ రష్యన్ అమ్మాయితో ఆది మాట్లాడేందుకు ప్రయత్నించడం. ఆమె ఏదో ఒకటి అనేది అక్కడ రచ్చ చేయడం మొత్తం షో ఇదే జరిగింది. దానికి జడ్జ్ లు పడి పడి నవ్వడం ఏంటో అంటూ ప్రేక్షకులు తీవ్ర స్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢీ షో ను ఇలా నవ్వుల పాలు చేశారు ఏంట్రా అంటూ సీనియర్ ఢీ షో కంటెస్టెంట్స్ బాధ పడుతున్నారు. మరీ ఇలా తయారు ఏంటో అంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా కూడా అసంతృప్తిగా ఉన్నారు.
Jamili Elections : కేంద్రం మంగళవారం (డిసెంబర్ 17) మధ్యాహ్నం లోక్సభలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్/పోల్’ (ONOP) బిల్లును…
Health tips In winter season : అందరూ చలికాలంలో చలికి గజగజ వణుకుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ…
Elinati Shani : శని భగవానుడు మన జాతకంలోనికి ప్రవేశించాడు అంటే. క్రమశిక్షణ నేర్పడానికి వచ్చాడని అర్థం. శని దేవుడిని…
Coffee : ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తో గొంతు తడవందే, ఆ రోజంతా హుషారు గా ఉండలేము.…
phonepe : ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా ఆన్లైన్ చెల్లింపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొబైల్ ఉంటే వెంటనే డబ్బులు కొట్టేస్తున్నారు.…
Chanakyaniti: చాణిక్యుడు మన జీవితంలో జరిగే ఎన్నో సందర్భాలు ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన తన నీతి శాస్త్రంలో చాలా…
Ram Charan : బాలీవుడ్ లో మొన్నటిదాకా టాప్ లీగ్ లో ఉన్న కియరా అద్వాని అనుకోకుండా వెనకపడిపోయింది. అమ్మడికి…
Mahesh Rajamouli Movie : సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమా విషయంలో…
This website uses cookies.