Dhee Dance Show : ఢీ లో రష్యన్‌ అమ్మాయి.. మరీ ఇంత చిల్లరగా తయారేంటి భయ్యా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dhee Dance Show : ఢీ లో రష్యన్‌ అమ్మాయి.. మరీ ఇంత చిల్లరగా తయారేంటి భయ్యా!

 Authored By prabhas | The Telugu News | Updated on :25 June 2022,10:00 am

Dhee Dance Show : ఈటీవీలో నిన్న మొన్నటి వరకు జబర్దస్త్‌, ఢీ, క్యాష్‌, శ్రీదేవి డ్రామా కంపెనీలు టాప్ రేటెడ్ షో లుగా పేరు దక్కించుకునేవి. వాటి వల్లే ఈటీవీ ప్రస్థానం కొనసాగుతుంది అనే వారు కూడా ఉన్నారు. నిజంగానే కేవలం ఆ షో ల వల్ల ఈటీవీకి మంచి రేటింగ్ వస్తూ ఉండేది. అలాంటి షో లను ఎందుకు ఈటీవీ వారు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జబర్దస్త్‌ ను చేజేతులా నాశనం చేశారు అంటూ విమర్శలు వస్తున్నాయి. విషయం లో కొందరు మల్లెమాల వారిని కూడా తప్పుబడుతున్నారు. ఇప్పుడు ఢీ పరిస్థితి కూడా అలాగే ఉంది.

ఢీ షో ను చాలా మంది డాన్స్ కోసం కాకుండా కామెడీ కోసం చూడటం మొదలు పెట్టారు. మొదట్లో సుధీర్‌ మరియు ప్రదీప్ ల మద్య కెమిస్ట్రీ బాగుండేది. వారిద్దరి వల్ల మంచి ఫన్ జెనరేట్ అయ్యేది. తద్వారా షో కు మంచి రేటింగ్‌ దక్కేది. ఇప్పుడు కూడా అదే కామెడీ కోసం అంటూ హైపర్ ఆది చేస్తున్న ప్రయత్నం విరక్తి పుట్టిస్తోంది. బాబోయ్ ఇదేం నీచంరా నాయన అంటూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఢీ షో ను నాశనం చేస్తున్నారు. ఒక పద్దతి పాడు లేకుండా కామెడీ పేరుతో విసిగిస్తున్నారు అనేది చాలా మంది అభిప్రాయం గా తెలుస్తోంది. ఢీ షో పై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది.

fans of Dhee dance show unhappy with comedy of hyper aadi

fans of Dhee dance show unhappy with comedy of hyper aadi

మొన్నటి ఎపిసోడ్‌ లో రష్యన్ అమ్మాయి మరియు నిఖిల్‌ వచ్చి ఎంటర్‌ టైన్‌మెంట్‌ ను ఇవ్వాలి అనుకుని ప్రేక్షకులకు తలనొప్పిని ఇచ్చారు. రష్యన్ అమ్మాయిని తీసుకు వచ్చిన నిఖిల్ తన స్నేహితురాలు అన్నట్లుగా పరిచయం చేశాడు. ఆ రష్యన్‌ అమ్మాయితో ఆది మాట్లాడేందుకు ప్రయత్నించడం. ఆమె ఏదో ఒకటి అనేది అక్కడ రచ్చ చేయడం మొత్తం షో ఇదే జరిగింది. దానికి జడ్జ్‌ లు పడి పడి నవ్వడం ఏంటో అంటూ ప్రేక్షకులు తీవ్ర స్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢీ షో ను ఇలా నవ్వుల పాలు చేశారు ఏంట్రా అంటూ సీనియర్ ఢీ షో కంటెస్టెంట్స్ బాధ పడుతున్నారు. మరీ ఇలా తయారు ఏంటో అంటూ చాలా మంది సోషల్‌ మీడియా ద్వారా కూడా అసంతృప్తిగా ఉన్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది