AP Farmers | ఏపీ రైతులకి శుభవార్త.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నూతన చర్యలు చేపట్టింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 4.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కాగా, సుమారుగా 7.12 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తోంది.రైతుల నుంచి పత్తిని నేరుగా ప్రభుత్వ గుర్తింపు పొందిన మార్కెట్ యార్డులు, నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల ద్వారా CCI (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేయనుంది.

#image_title
కనీస మద్దతు ధరలు:
పొడవు పింజ పత్తి: రూ. 8,110 / క్వింటాల్
మధ్యస్త పింజ పత్తి: రూ. 7,710 / క్వింటాల్
రైతులు తమ వివరాలను ఆధార్ ఆధారిత ఈ-పంట డేటా ఆధారంగా రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు CM APP ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవడంతో పాటు, పత్తిని ఏ తేదీన, ఏ సమయానికి అమ్మాలనుకుంటున్నారో ముందుగానే లాక్ చేయవచ్చు. ఈ విధానం వల్ల కేంద్రాల్లో గందరగోళం లేకుండా పద్ధతిగా కొనుగోలు జరగనుంది.
అవసరమైన డాక్యుమెంట్లు విషయానికి వస్తే… ఆధార్ కార్డ్, పట్టాదారు పాసుబుక్కు జిరాక్స్, రేషన్ కార్డు (కుటుంబ సభ్యుల గుర్తింపునకు), బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి