PM Kisan Scheme : పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు రావాలంటే వెంటనే రైతులు ఇలా చేయాల్సిందే.. లేకపోతే డబ్బులు రావు
PM Kisan Scheme : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ గురించి తెలుసు కదా. ఈ స్కీమ్ కింద ప్రతి రైతుకు సంవత్సరానికి ఎకరానికి కేంద్ర ప్రభుత్వం రూ.6000 ఆర్థిక సాయం అందిస్తోంది. మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటి వరకు 10 సార్లు రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. త్వరలోనే 11వ విడుత డబ్బులను జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది.
అయితే.. 11 వ విడత డబ్బులను రైతులు పొందాలంటే రైతులు ఒక పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. 11వ ఇన్ స్టాల్ మెంట్ డబ్బులు రావు. దాని కోసం.. రైతులు వెంటనే ఈకేవైసీ అప్ డేట్ చేసుకోవాలి. ఈకేవైసీ అప్ డేట్ చేయకపోతే డబ్బులు రావు.ఈకేవైసీని అప్ డేట్ చేయడానికి pmkisan.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.
PM Kisan Scheme : ఈకేవైసీ అప్ డేట్ ఎలా చేయాలి?
అక్కడ హోమ్ పేజీలో ఉండే ఈకేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెర్చ్ పై క్లిక్ చేస్తే.. లబ్ధిదారుడి వివరాలు వస్తాయి. అక్కడ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ ఓటీపీపైన క్లిక్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేయగానే.. ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.