FASTag Annual Pass | ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు ముఖ్యమైన అలర్ట్: వార్షిక పాస్ తీసుకున్నారా? లేదంటే ఈ వివరాలు తప్పక తెలుసుకోండి!
FASTag Annual Pass |
దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టింది. దీన్ని ఉపయోగించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తించాలి. లేకపోతే మీరు తీసుకున్న పాస్ వృథా కావచ్చు.
ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అంటే ఏమిటి?
ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) ఈ వార్షిక పాస్‌ను ప్రైవేట్ కార్లు, జీపులు, వాన్‌ల కోసం రూపొందించింది. ఒక్కసారి రూ. 3,000 చెల్లిస్తే, ఈ పాస్ ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు వరకు చెల్లుతుంది (ఏది ముందు పూర్తి అయితే అది వర్తిస్తుంది). ఇది మీ వాహనానికి లింక్ అయిన ఫాస్ట్ ట్యాగ్ ద్వారా పనిచేస్తుంది.

#image_title
ఎక్కడ కొనాలి?
ఈ పాస్‌ను మీరు సులభంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు:
NHAI అధికారిక వెబ్‌సైట్
హైవే యాత్ర మొబైల్ యాప్
టోల్ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.
యాక్టివేషన్ ఎలా జరుగుతుంది?
ముందుగా మీ వాహనం అర్హత కలిగిందా, ఫాస్ట్ ట్యాగ్ వాలిడిటీ ఉందా అని చెక్ చేయాలి.
అన్ని వివరాలు సరైనట్లైతే ₹3,000 చెల్లించాలి.
చెల్లింపు చేసిన రెండు గంటల తర్వాత పాస్ యాక్టివేట్ అవుతుంది.
కొత్త ఫాస్ట్ ట్యాగ్ అవసరమా?
అవసరం లేదు. మీరు ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ట్యాగ్‌కే ఈ పాస్ లింక్ అవుతుంది. కానీ కొన్ని షరతులు:
ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్‌లో ఉండకూడదు
విండ్షీల్డ్‌పై సరైన రీతిలో ఇన్‌స్టాల్ చేసి ఉండాలి
తప్పుగా అమర్చిన ట్యాగ్ అయితే పాస్ పనిచేయదు
వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) ఫాస్ట్ ట్యాగ్‌కు లింక్ అయి ఉండాలి
ఈ పాస్‌ను ఇతర వాహనాలకు ట్రాన్స్‌ఫర్ చేయడం సాధ్యం కాదు. రిజిస్టర్డ్ వాహనంతో మాత్రమే వాడాలి. ఒకవేళ మరో వాహనంలో వాడే ప్రయత్నం చేస్తే, ట్యాగ్ ఇన్‌యాక్టివ్ అవుతుంది.మీరు తరచూ హైవేలో ప్రయాణించే వారు అయితే, ఈ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ మీకు అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. కానీ యాక్టివేషన్, ఇన్‌స్టాలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.