Vizianagaram : విజయనగరంలో అనాధగా తండ్రి శవం ఎవరు పట్టించుకోలేదు.. వీడియో వైరల్..!!
Vizianagaram ; ప్రస్తుత సమాజంలో మానవత్వం ఉన్న కొద్ది తగ్గిపోతోంది. సమాజంలో దేవుడెరుగు.. కనీసం కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమానురాగాలు ఉండటం లేదు. పెంచి పోషించిన తల్లిదండ్రులను పిల్లలు చూడని పరిస్థితి. తల్లిదండ్రులను చాలా నిర్లక్ష్యంగా చూసే పిల్లలు సమాజంలో ఎక్కువైపోతున్నారు. దీంతో నవమాసాలు మోసి పెంచి పోషించిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చాక దిక్కులేని చావులు చస్తున్నారు. సరిగ్గా ఇదే తరహాలో విజయనగరం జిల్లాలో ఓ సంఘటన చోటు చేసుకుంది.
కన్న బిడ్డలే తండ్రి అంతిమ సంస్కరణాలు చేయటానికి ముందుకు రాని పరిస్థితి. దీంతో ఓ మహిళ.. కూతురు మాదిరిగా ఆ శవానికి అన్ని తానేయుండి దహన సంస్కరణలు చేయించడం జరిగింది. విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఒకానొక అతిథిగా తండ్రిగా వచ్చి ఓ మహిళ ఇంటిలో కొన్ని నెలల పాటు జీవనం కొనసాగిస్తున్న వ్యక్తి అనుకోకుండా అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ క్రమంలో సదరు మహిళ ఆ వ్యక్తి యొక్క కన్న బిడ్డలకు సమాచారం అందించడం జరిగింది. తండ్రి చనిపోయిన సమాచారం అందుకున్న కన్నబిడ్డలు కనీసం చివరి చూపుకు రాకుండా… కనీసం రూపాయి కూడా ఇవ్వలేదని ఆ మహిళ లబోదిబోమంది. కుటుంబ సభ్యులు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో సదరు మహిళ ఆవేదనకు గురై.. ఆ అనాధ శవాన్ని దహన సంస్కరణలు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఈ వీడియో వైరల్ అవుతుంది.
