Prakasam: కన్నకూతురిపై సొంత తండ్రి అఘాయిత్యం.. గర్భవతిని చేసిన కసాయి తండ్రి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prakasam: కన్నకూతురిపై సొంత తండ్రి అఘాయిత్యం.. గర్భవతిని చేసిన కసాయి తండ్రి

 Authored By gatla | The Telugu News | Updated on :15 July 2021,10:56 pm

Prakasam : ఆడవాళ్లకు బయటే కాదు.. ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. చివరకు వావీ వరసలు మరిచి మహిళల మీద, అమ్మాయిల మీద అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. సొంత తండ్రే కిరాతకుడిగా మారి.. కన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బెస్తవారిపేట మండలంలో చోటు చేసుకున్నది.

father molested daughter in prakasam dist

father molested daughter in prakasam dist

తన భార్య, పిల్లలతో కలిసి ఓ వ్యక్తి ఊరికి దూరంగా ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. అయితే.. తన భార్య ఇంట్లో లేని సమయం చూసి.. తన సొంత కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. గత జనవరి నుంచి అలా రోజూ మద్యం మత్తులో తన కూతురుపై అత్యాచారం చేస్తున్నాడు ఆ దుర్మార్గుడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చింది. తన వయసు 14 ఏళ్లు. చాలాసార్లు బెదిరించి.. మద్యం మత్తులో తనపై అఘాయిత్యం చేశాడు.

అయితే.. ఇటీవల తన కూతురును తండ్రి తీవ్రంగా హింసించడంతో తట్టుకోలేక.. ఆ బాలిక 100 నెంబర్ కు ఫోన్ చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. తండ్రిని హెచ్చరించి వదిలేశారు. బాలికను తన తాత ఇంటికి పంపించారు. అక్కడికి వెళ్లిన బాలిక.. జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పింది. దీంతో వెంటనే బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షించగా.. ఐదు నెలల గర్భవతి అని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో వెంటనే తన సొంత తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా… వెంటనే ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రబుద్ధుడు.. పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్టు సమాచారం.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది