Father : కన్న కొడుకుల దాష్టీకం.. జిల్లా కలెక్టర్‌కు రూ.2 కోట్ల ఆస్తి రాసిచ్చిన తండ్రి..!
Father : ప్రస్తుత సమాజంలో పిల్లలు తమ పేరెంట్స్‌ను పట్టించుకోవడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. తిండి పెట్టకుంట వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ఇంట్లోంచి గెంటివేస్తు్న్నారు. ఆస్తుల కోసం కన్న తల్లితండ్రులను, తోడబుట్టిన వారితో గొడవలు పెట్టుకుంటున్నారు. మరికొన్ని ఘటనల్లో ఆస్తుల కోసం ఏకంగా రక్త సంబంధీకులను సైతం చంపడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి దారుణాలకు సంబంధించిన విషయాలను మనం రోజూ వార్త కథనాలు, సోషల్ మీడియా ద్వారా చూస్తునే ఉంటాం. తాజాగా జరిగిన […]
Father : ప్రస్తుత సమాజంలో పిల్లలు తమ పేరెంట్స్‌ను పట్టించుకోవడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. తిండి పెట్టకుంట వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ఇంట్లోంచి గెంటివేస్తు్న్నారు. ఆస్తుల కోసం కన్న తల్లితండ్రులను, తోడబుట్టిన వారితో గొడవలు పెట్టుకుంటున్నారు. మరికొన్ని ఘటనల్లో ఆస్తుల కోసం ఏకంగా రక్త సంబంధీకులను సైతం చంపడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి దారుణాలకు సంబంధించిన విషయాలను మనం రోజూ వార్త కథనాలు, సోషల్ మీడియా ద్వారా చూస్తునే ఉంటాం. తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొడుకులతో విసిగిపోయిన ఓ తండ్రి రూ.2 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఏకంగా ఆ జిల్లా కలెక్టర్ పేరిట రాసి షాకిచ్చాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. ఆగ్రాలోని నీరాలాబాద్ పీపల్‌మండికి చెందిన గణేశ్ శంకర్ పాండే (88)కు ఇద్దరు కుమారులు. ఈయన సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తుంటాడు. గతంలో తన సోదరులతో విడిపోయాక ఇతని వాటాగా 225 చదరపు గజాల స్థలం వచ్చింది. ప్రస్తుతం దీని విలువ రూ.2 కోట్లు.. అయితే, తండ్రి వద్ద ఉన్న ఆస్తి కోసం తన ఇద్దరు కుమారులు కొట్టుకోవడం ప్రారంభించారు. పెద్ద కుమారుడు దిగ్విజయ్ తండ్రికి చెందిన ఆస్తిలో తనకే అధిక భాగం రావాలని తరచూ గొడవ చేస్తుండేవాడు. శంకర్ పాండే ఎంత నచ్చజెప్పాలని చూసిన అతను వినేవాడు కాదు.దీంతో విసుగు చెందని పెద్దాయన షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.
Father : కొడుకులను కాదని.. కలెక్టర్‌కు
పెద్ద కుమారుడి వద్దే ఉంటున్న శంకర్ పాండే కొడుకు పెట్టే టార్చర్ భరించలేక తిరిగి తన సోదరులు రఘునాథ్, అజయ్‌ల వద్దకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే తనకు వాటాగా వచ్చిన 225 చదరపు గజాల భూమని జిల్లా కలెక్టర్ ఏకే సింగ్ పేరిట రాశారు. అందుకు సంబంధించి ఫార్మాలిటిస్ మొత్తం పూర్తిచేశారు. రిజిస్ట్రేషన్ పత్రాలతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఏకే సింగ్‌కు అప్పగించారు. దీంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. తన కుమారులకు బుద్ది చెప్పేందుకే ఇలా చేసినట్టు క్లారిటీ ఇచ్చారు శంకర్ పాండే..