Fatty liver | ఫ్యాటీ లివర్ ఉన్నవారు తప్పక చదవాల్సిన విషయాలు.. ఏం తినాలి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fatty liver | ఫ్యాటీ లివర్ ఉన్నవారు తప్పక చదవాల్సిన విషయాలు.. ఏం తినాలి?

 Authored By sandeep | The Telugu News | Updated on :14 September 2025,8:00 am

Fatty liver | ఈ రోజుల్లో చాలామందిని బాధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ (Fatty Liver) ఒకటి. చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ఇవన్నీ కలిసి లివర్‌ని దెబ్బతీస్తున్నాయి. కాలేయం అనేది మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది నానా రకాల డిటాక్సిఫికేషన్ పనులను నిర్వహిస్తుంది. అందుకే, దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం.

#image_title

అయితే, ఒకసారి ఫ్యాటీ లివర్ సమస్య మొదలయితే.. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా లివర్‌ను రీబిల్డ్ చేసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాటీ లివర్ ఉన్నవారు తినాల్సిన ఆహార పదార్థాలు:
1. ఆకుకూరలు:

పాలకూర, తోటకూర, మెంతి కూర, ఆవాల ఆకు వంటి ఆకుకూరలు లివర్‌కు మేలు చేస్తాయి.

వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల లివర్ డిటాక్స్‌కు ఉపయోగపడతాయి.

2. తృణధాన్యాలు:

బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటివి తృణధాన్యాలకు మంచి ఉదాహరణలు.

ఇవి ఫ్యాటీ లివర్‌ను తగ్గించడంలో, బరువు నియంత్రణలో ఉపయోగపడతాయి.

3. ఆపిల్:

రోజుకు రెండు ఆపిల్స్ తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆపిల్, కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

4. బ్లాక్ కాఫీ:

రోజు రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగితే, లివర్‌కు రక్షణ కలిగించవచ్చు.

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయంపై పేరుకుపోయే కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది