Fatty Liver | ఫ్యాటీ లివర్ సంకేతాలు.. ప్రాథమిక దశలో కనిపించని ముప్పు
Fatty Liver | నేటి జీవనశైలిలో తరచుగా వినిపించే సమస్య ఫ్యాటీ లివర్. ఇది మొదటిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే క్రమంగా అభివృద్ధి చెందుతుంది. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది జీవనాంతకమైన లివర్ సిరోసిస్, జాండిస్ వంటి వ్యాధుల రూపంలో ప్రాణాలకు ముప్పుగా మారుతుంది.

#image_title
ఫ్యాటీ లివర్ అంటే ఏంటి?
ఫ్యాటీ లివర్ అనేది లివర్‌లో అధిక కొవ్వు పేరుకుపోవడం వలన వచ్చే స్థితి. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ – మద్యం ఎక్కువగా సేవించడం వలన. రెండోది నాన్-అల్కహాలిక్ ఫ్యాటీ లివర్ – ఆహారం, జీవనశైలి, కాలుష్యం వంటివి కారణాలు
చాలా సందర్భాల్లో ప్రాథమిక దశలో ఏమాత్రం లక్షణాలు కనిపించవు. అయితే వ్యాధి తీవ్రత పెరిగినకొద్దీ కొన్ని లక్షణాలు బయటపడతాయి.మితమైన అలసట,ఆకలిలేకపోవడం,బరువు తగ్గడం,చిరాకు, జీర్ణ సమస్యలు, మూత్రం పసుపు రంగులోకి మారడం. ఇవి కూడా నిర్లక్ష్యం చేస్తే… జాండిస్, లివర్ నాశనం (సిరోసిస్) వచ్చే ప్రమాదం ఉంది.
ఫ్యాటీ లివర్‌కి కారణమవుతున్న జీవనశైలి తప్పిదాలు
👉 అధిక ఫ్రక్టోస్ ఉన్న ఆహారం (సోడాలు, మిఠాయిలు, ఫ్రూట్ జ్యూసులు)
👉 రిఫైన్డ్ ఆయిల్స్, ఫ్రైడ్ ఫుడ్స్, అధిక కేలరీల ఆహారం
👉 నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి
👉 మద్యపానం
👉 తాజా పరిశోధనల ప్రకారం, గాలి కాలుష్యం కూడా లివర్‌పై ప్రభావం చూపుతోంది