పచ్చళ్లు పెట్టే సమయంలో తలలో పూలు పెట్టుకోరు.. ఎందుకో తెలుసా..?
పచ్చళ్లు తెలుగు వారికి వాటితో విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఏ పూట అయినా పచ్చడి వేసుకుని కొద్దిగా అయినా అన్నం తిననిదే అసలు అన్నం తిన్నట్టే అనిపించదు. ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ల సీజన్ వచ్చినట్టే. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటా మామిడి పచ్చళ్ల ప్రిపరేషన్ స్టార్ అవుతుంది. ఈ తరుణంలోనే చాలా మంది మామిడి పచ్చడితో పాటుగా, వివిధ రకాల పచ్చళ్లను పెడుతూ ఉంటారు. పచ్చడి పెట్టడంలో చాలా అనుభవం అవసరం.చాలా మంది ఈ మధ్య యూట్యూబ్ లో చూసి పచ్చళ్ల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే సఫలం అవుతుంటారు. ఉప్పో, కారమో లేదా ఇంకేదైనా పదార్థమో తగ్గిందంటే ఇక పచ్చడి సంగతి మర్చిపోవాల్సిందే.
అది ఏమాత్రం టేస్ట్ కుదరదు. పచ్చడి ఎంతగా మాగితే అంతగా టేస్ట్ వస్తుంది. ఈరోజు పెడితే అది చక్కగా మాగిన తర్వాత తింటే అమోహంగా ఉంటుంది. దీనికి కొంత అనుభవం మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎందుకంటే అది ఇవాళ తిని రేపు పడేసేది కాదు. కొన్ని నెలల పాటు నిల్వ చేసే ఆహారం. అలాగే రోజూరోజుకూ దాని టేస్ట్ పెరుగుతూ ఉండాలి. కానీ ఏమాత్రం తగ్గిన భావన కలగకూడదు. పచ్చడి చేసే సమయంలో కొన్ని మెలకువలు పాటించాలి.సాధారణంగా పచ్చడి పెడితే ఒక్కోసారి బూజు పడుతుంది. దీని ప్రధాన కారణం శిలింద్రాల జాతికి చెందిన ఒక జీవి. ఈ బూజు అనేది ఉష్ణోగ్రత తక్కువైనా, గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నా బూజు పడుతుంది.
దీంతో పాటుగా పచ్చడి పెట్టేటప్పుడు ప్రధానమైనది ఉప్పు. పచ్చడిలో ఉప్పు ఎక్కువ ఉంటే బూజు అంత తక్కువగా వస్తుంది. అలాగే పచ్చడిలో వేసే కారం, నూనె సూక్ష్మ జీవులు ఇతర హానికర క్రిములు తయారు కాకుండా అడ్డుకుంటాయి.పచ్చళ్లను పెట్టడానికి ముందుగానే మామిడి ముక్కలను బాగా కడిగి తుడిచి తడి లేకుండా చేసి పచ్చడి పెట్టే జాడీలు కూడా బాగా శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి. అందులో ఎలాంటి సూక్ష్మ క్రిములు లేకుండా చూడాలి. ఆడవారు నిల్వ పచ్చడి చేసేటప్పుడు తలలో పూలు కూడా పెట్టుకోరు. ఇలా పూలు పెట్టుకోవడం వల్ల పచ్చడి చేసే సమయంలో ఏమైన అందులో పొరపాటుగా పడిపోతే పచ్చడి అంతా చెడిపోతుంది. ఈ విధమైన జాగ్రత్తలతో బయటి నుండి వచ్చే సూక్ష్మ క్రిములను అడ్డుకునే వారు.