Omicron Death : భారత్‌లో తొలి ఓమిక్రాన్ మరణం.. హై అలెర్ట్..!
దేశంలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ కు చెందిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు ఓమిక్రాన్ బారిన పడి కన్ను మూసినట్లు వైద్యాధికారులు అధికారికంగా ప్రకటించారు. మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఈ బాధితుడు బిపీ, డయాబెటిస్ వంటి వ్యాధులను కలిగి ఉన్నాడని తెలిపారు.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర లో కూడా ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మృతి చెందినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28నే ఓమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి మరణించాడని ఒక జాతీయ వార్త సంస్థ తెలిపింది. ఇటీవల నైజీరియా నుంచి మహారాష్ట్రకు తిరిగి వచ్చిన ఓ వ్యక్తి హార్ట్ అటాక్ తో మరణించినట్లు చూపించారని, కానీ వాస్తవానికి ఆ వ్యక్తి ఓమిక్రాన్..

First Omicron deaths in india
సోకి చనిపోయినా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా మరణం కాకుండా ఇతర కారణాలతో అతడు మరణించాడని రిపోర్ట్ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. ఇక దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి భారతీయుల గుండెల్లో మళ్ళీ వణుకు పుట్టిస్తోంది.