YS Jagan : జగన్ చెప్పినట్టే జరిగింది.. కేంద్రం భారీ ప్రకటన..!
YS Jagan : వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రచ్చ రచ్చ అవుతున్న విషయం తెలిసిందే. మేము కూడా బిడ్ వేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో ఒక్కసారిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం హీటెక్కింది. అసలు ప్రైవేటీకరణ ఆపేదే లేదు.. అంటూ కేంద్రం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ తర్వాత ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన కేంద్రం.. ఈవోఐ బిడ్లకు మాత్రం అవకాశం ఇచ్చింది.
దానికి సంబంధించిన గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్యాపిటల్, ముడిసరుకు కోసం బిడ్ల దాఖలుకు మార్చి 21న విశాఖ ఉక్కు ప్రకటన జారీ చేసింది. కానీ.. ఆ గడువు నిన్నటితోనే ముగియడంతో మరో ఐదు రోజులు గడువును పెంచుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి బిడ్లు దాఖలు చేయడానికి పలు కంపెనీలకు అవకాశం ఇచ్చింది. కానీ.. బిడ్లు దాఖలు చేసే వాళ్లు స్టీల్ వ్యాపారంతో ముడిపడి ఉండాలి.
YS Jagan : ఇప్పటి వరకు 22 బిడ్లు దాఖలు
శనివారం మధ్యాహ్నం వరకు 22 బిడ్లు దాఖలు అయ్యాయి. మరో ఐదు రోజులు బిడ్ల గడువును పెంచడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. చాలామంది ప్రజాప్రతినిధులు, ప్రజలు, సామాజిక వేత్తలు.. విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ముందడుగు వేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉక్కు ఉద్యమంలో భాగస్వాములయి.. ప్రైవేటు కంపెనీ ద్వారా ఆయన బిడ్ దాఖలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగు వారందరికీ బిడ్డలాంటిది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందుకే విశాఖ ప్రజల తరుపున తాను బిడ్ దాఖలు చేశానని చెప్పుకొచ్చారు జేడీ లక్ష్మీనారాయణ.