US : అమెరికాలో కుటుంబ కలహాలు.. భారతీయ పౌరుడు సహా నలుగురి కాల్చివేత..!

US : అమెరికాలో కుటుంబ కలహాలు.. భారతీయ పౌరుడు సహా నలుగురి కాల్చివేత..!

 Authored By suma | The Telugu News | Updated on :24 January 2026,9:00 pm

ప్రధానాంశాలు:

  •  US : అమెరికాలో కుటుంబ కలహాలు.. భారతీయ పౌరుడు సహా నలుగురి కాల్చివేత..!

US :  అమెరికాలో  మరోసారి కాల్పుల కలకలం రేపింది. అట్లాంటా Atlantaసమీపంలోని లారెన్స్‌విల్లే Lawrenceville పట్టణంలో ఉన్న గ్విన్నెట్ కౌంటీలో జరిగిన కాల్పుల Shootingఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కుటుంబంలో ఏర్పడిన వివాదం కారణంగా జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటన అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక నివేదికల ప్రకారం కాల్పుల ఘటన బ్రూక్ ఐవీ కోర్టులోని ఒక నివాసంలో చోటుచేసుకుంది. మొదట బాధితుల జాతీయతపై స్పష్టత లేకపోయినా అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ స్పందిస్తూ మృతుల్లో ఒకరు భారతీయుడని అధికారికంగా నిర్ధారించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Four people shot dead in America

US : అమెరికాలో కుటుంబ కలహాలు.. భారతీయ పౌరుడు సహా నలుగురి కాల్చివేత..!

US : బాధితులు, అనుమానితుడి వివరాలు

ఈ కాల్పుల్లో మరణించిన వారిలో 51 ఏళ్ల విజయ్ కుమార్ కూడా ఉన్నాడు. పోలీసులు అతడినే ప్రధాన అనుమానితుడిగా గుర్తించారు. అతని భార్య 43 ఏళ్ల మీము డోగ్రా కూడా మృతుల్లో ఒకరు. వారితో పాటు గౌరవ్ కుమార్ (33) నిధి చందర్ (37) హరీష్ చందర్ (38) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పేర్లను బట్టి వీరంతా భారత సంతతికి చెందినవారిగా భావిస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఒకరి జాతీయత మాత్రమే నిర్ధారణకు వచ్చింది. గ్విన్నెట్ కౌంటీ పోలీసుల వివరాల ప్రకారం విజయ్ కుమార్ అతని భార్య మరియు వారి 12 ఏళ్ల బిడ్డ అట్లాంటాలో నివసిస్తున్నారు. ఘటనకు ముందు వారు తమ బంధువులైన గౌరవ్, నిధి, హరీష్ నివాసానికి వెళ్లారు. ఆ ఇంట్లో గౌరవ్, నిధి తమ 7 మరియు 9 ఏళ్ల ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు.

US : ఘటనకు దారితీసిన పరిణామాలు

పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ కుమార్ దంపతుల మధ్య అట్లాంటాలోని వారి ఇంట్లోనే గొడవ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ వాగ్వాదం తరువాతే వారు బంధువుల ఇంటికి వెళ్లినట్టు సమాచారం. అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి చివరకు కాల్పులకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన సమయంలో ముగ్గురు పిల్లలు 12, 7, 9 ఏళ్ల వయస్సు గలవారు. ప్రాణభయంతో ఒక గదిలో దాక్కున్నారని దర్యాప్తులో వెల్లడైంది. అనుమానితుడి 12 ఏళ్ల కుమారుడే ధైర్యం చేసి 911కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరేసరికి నలుగురు మృతిచెందినట్లు గుర్తించారు. ఈ విషాదంపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కుటుంబ వివాదంతో ముడిపడి ఉన్న ఈ దారుణ ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తున్నాం అని X వేదికగా తెలిపింది.
పోలీసులు నివాసానికి సమీపంలోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విజయ్ కుమార్‌పై హత్య తీవ్రమైన దాడి పిల్లలపై క్రూరంగా ప్రవర్తించడం వంటి అభియోగాలు నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతుండగా ఈ ఘటన కుటుంబ వివాదాలు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో మరోసారి హెచ్చరికగా నిలుస్తోంది.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది