Free LPG Cylinder : ఫ్రీ LPG సిలిండర్.. పెళ్లైన కొత్త జంటకు సూపర్ న్యూస్..!
ప్రధానాంశాలు:
Free LPG Cylinder : ఫ్రీ LPG సిలిండర్.. పెళ్లైన కొత్త జంటకు సూపర్ న్యూస్..!
Free LPG Cylinder : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన నుంచి ప్రజలకు కావాల్సిన ప్రయోజనాలను అందిస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా కొత్తగా పెళ్లైన జంటలు ఇంకా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ ఉజ్వల యోజన పథకం తీసుకొచ్చారు. కొత్తగా పెళ్లైన జంటలకు ఉచిత్ర గ్యాస్ కనెక్షన్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా సమాజంలో ఆర్ధికంగా బలహీన వర్గాలకు, మహిళలకు ఉచిత్ ఎల్.పి.జి గ్యాస్ కనెక్షన్ అందించడానికి చూస్తుంది. గ్యాస్ కనెక్షన్ పొందే ఛాన్స్ లేని కొత్తగా పెళ్లైన జంటలు ఈ పథకం ప్రత్యేకంగా ప్రయోజనం అందిస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఎవరైతే అర్హత కలిగిన కుటుంబాలు ఉచిత ఎల్.పి.జి గ్యాస్ కనెక్షన్‌ని పొందే ఛాన్స్ ఉంటుంది.
Free LPG Cylinder తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికి మాత్రమే..
వీరిలో ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు కూడా ఇంట్లో ఇంధనాన్ని పొందగలిగేలా ఈ స్కీం ఉపయోగపడుతుంది. ఐతే దీన్ని పొందడానికి లబ్దిదారులు ఎలాంటి అర్హత కలిగి ఉండాలన్నది చూస్తే.. ఈ పథకం ప్రత్యేకంగా మహిళల కోసమే ఏర్పాటు చేశారు. వారిని మాత్రమే ఈ స్కీం కింద లబ్ధిదారులుగా చేస్తుంది. ఎల్‌పిజి కనెక్షన్ మహిళా ఎవరైనా ఇంటి పెద్ద పేరు మీద జారీ చేస్తారు. తెల్ల రేషన్ కార్డును కలిగి ఉన్న వారికి ఇంకా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఈ ఉజ్వల యోజన పథకానికి అర్హులు.
Free LPG Cylinder : ఫ్రీ LPG సిలిండర్.. పెళ్లైన కొత్త జంటకు సూపర్ న్యూస్..!
ఐతే కొత్తగా పెళ్లయిన జంటలకు కూడా ఈ పథకం వర్తిస్తుని. ఐతే ఇంతకుముందు ఈ పథకం ప్రయోజనం పొందకపోతే దీని ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. దీని ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన వారు మొదటి రీఫిల్ ఉచితం గా వస్తుంది. ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్‌ను అందించడమే కాకుండా ఫస్ట్ సిలిండర్ రీఫిల్ కూడా ఉచితంగా అందిస్తరు. దీని వల్ల ఫ్యామిలీకి మొదటిసారి ఎలాంటి ప్రాథమిక ఆర్థిక భారం లేకుండా గ్యాస్ కనెక్షన్‌ని ఉపయోగించే అవకాశం ఉంది. ఐతే ప్రతి కుటుంబం ఒక్కసారి మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందగలుగుతారు.