Ration Card : రేషన్ కార్డు ఉందా? మీకు బ్యాడ్ న్యూస్? వెంటనే ఇది చదవండి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : రేషన్ కార్డు ఉందా? మీకు బ్యాడ్ న్యూస్? వెంటనే ఇది చదవండి?

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 June 2021,10:00 am

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? మీది తెలంగాణా? అయితే.. మీరు వెంటనే అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే.. ప్రతి నెల ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ఈనెల మీకు అందకపోవచ్చు. ఇప్పటి వరకు తీసుకుంటే ఓకే కానీ.. ఇప్పటి వరకు రేషన్ బియ్యం తీసుకోని వాళ్లు వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే.. ఈ నెల రేషన్ బియ్యానికి బ్రేక్ పడే అవకాశం ఉంది. అసలే కరోనా రోజులు. ఆపై లాక్ డౌన్. దీంతో రేషన్ డీలర్ల వద్దకు స్టాక్ సరైన సమయానికి రావడం లేదట. దీంతో రేషన్ బియ్యం సరఫరా చాలా చోట్ల నిలిచిపోతోంది.

free ration rice distribution in telangana

free ration rice distribution in telangana

నిజానికి.. ప్రతి నెల తెలంగాణ ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుదారుడికి 6 కిలోల బియ్యం అందజేస్తుంది. కిలోకు రూపాయి తీసుకొని ఆ బియ్యాన్ని సరఫరా చేస్తారు. అయితే.. కరోనా వల్ల గత నెల లాక్ డౌన్ విధించడంతో పనులు లేక చాలామంది డబ్బులు లేక అల్లాడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 10 కిలోలను రేషన్ కార్డు ఉన్నవాళ్లకు అందిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10 కిలోలతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం కూడా మరో 5 కిలోలు అదనంగా ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఈనెల ఉచితంగా మనిషికి 15 కిలోల బియ్యాన్ని అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.

Ration Card : 5 నుంచే ప్రారంభం అయిన రేషన్ బియ్యం పంపిణీ

అయితే.. ఈ నెల 5 నుంచే రేషన్ బియ్యం పంపిణీ షురూ అయింది. కొన్ని రోజులు స్టాక్ ఉన్నన్ని రోజులు రేషన్ డీలర్లు బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేశారు. కానీ.. తెలంగాణలో ఉన్న లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఇంకా బియ్యం అందలేదు. ఇంతలోనే రేషన్ షాపుల్లో స్టాక్ అయిపోయింది. డీడీలు చెల్లించినా కూడా లాక్ డౌన్ వల్ల వాహనాల కొరతతో బియ్యం స్టాక్ రావడం లేదట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులను పెట్టేశారు. అందుకే.. మీరు ఇంకా బియ్యం తీసుకోకపోతే ముందు వెంటనే రేషన్ షాప్ కు వెళ్లి.. ఎప్పుడు బియ్యం స్టాక్ వస్తుందో కనుక్కొని స్టాక్ రాగానే తీసుకోండి. లేదంటే ఈ నెల మీకు బియ్యం రానట్టే.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది