YSRCP : ‘గడప గడపకు మన ప్రభుత్వం’ సూపర్ హిట్
YSRCP : ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వారి వారి నియోజక వర్గాల్లో మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజల నుండి మంచి స్పందన దక్కింది. మంత్రులు ఎమ్మెల్యేల రాక నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి గడప లో కూడా ఎమ్మెల్యేలు మరియు మంత్రులు చేస్తున్న సందడితో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపిస్తుంది. పార్టీకి ప్రజల్లో ఉన్న పట్టు ఈ సందర్బంగా కనిపిస్తుంది.
సామాన్య ప్రజల వద్దకు మంత్రులు.. ఎమ్మెల్యేలు వెళ్లిన సమయంలో వారికి దక్కుతున్న ఆహ్వానం అపూర్వం. ప్రతి ఒక్కరు కూడా తమకు అందుతున్న సంక్షేమ పథకాల విషయంలో చాలా సంతోసంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. కొందరు తమకు ఉన్న సమస్యలను చెప్పడంతో అప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం అధికారులు మరియు ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. మొదటి రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సూపర్ హిట్ అయ్యిందని వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

gadapa gadapaku mana prabhutvam ysrcp public response
ఈ కార్యక్రమం ద్వారా జనాల్లోకి మరింత ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంటుందని.. ఏ ఒక్క మంత్రి కాని ఎమ్మెల్యే కాని ఈ కార్యక్రమానికి దూరంగా ఉండవద్దు అంటూ జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపించాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడం పట్ల వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. రెండవ రోజు కూడా ఉదయాన్నే ఈ కార్యక్రమం లో భాగంగా మంత్రులు గడప గడప తిరుగుతూ ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.