Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  ఈ మూడు బిజినెస్ లో ఏది చేసిన మీకు లాభలే

  •  కొత్తగా బిజినెస్ చేద్దామనుకునేవారికి ఈ బిజినెస్ ఐడియా బెస్ట్

  •  Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు. కాకపోతే ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది..? ఏ బిజినెస్ లో లాభాలు ఉంటాయి..? ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది తెలియక చాలామంది అయోమయంలో పడుతున్నారు. అలాంటి వారి కోసం మీకు మంచి బిజినెస్ ఐడియాస్ షేర్ చేస్తున్నాం. ప్రస్తుతం బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉన్నవారికి డ్రై మటన్ తయారీ మంచి ఆప్షన్. ఈ బిజినెస్ పెద్దగా ప్రచారంలో లేకపోయినా, దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు, ఇతర మాంసాహార ప్రియులు డ్రై మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ బిజినెస్ ప్రారంభించేందుకు సుమారు రెండు లక్షల రూపాయల పెట్టుబడి అవసరం. ముఖ్యంగా సోలార్ డ్రైయర్, ప్యాకింగ్ మెషిన్ వంటి పరికరాలు, అలాగే FSSAI లైసెన్స్, GST నమోదు, బ్రాండింగ్ కోసం అవసరమైన స్టిక్కర్లు మొదలైనవి అవసరమవుతాయి.

Business కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఈ బిజినెస్ చెయ్యండి మీకే లాభాలే లాభాలు

సోలార్ డ్రైయర్ వల్ల తక్కువ సమయంలో మటన్‌ను ఎండబెట్టవచ్చు. ఈ ప్రక్రియలో ముందుగా మేకలు లేదా గొర్రెలను కొనుగోలు చేసి, వాటి నుంచి మాంసాన్ని సేకరించాలి. సేకరించిన మాంసాన్ని ఎండలో ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ సమయంలో పసుపు, మిరియాల పొడి, జీలకర్ర వంటి రుచికరమైన ఫ్లేవర్లు జోడించి మరింత ఆకర్షణీయంగా తయారుచేయవచ్చు. ఈ విధంగా తయారైన డ్రై మటన్‌ను 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు మరియు 1 కిలో ప్యాకెట్లుగా మార్కెట్లో విక్రయించవచ్చు.

డ్రై మటన్ తయారీలో 1 కిలో మటన్ నుంచి సుమారు 350–400 గ్రాముల డ్రై మటన్ లభిస్తుంది. ఈ లెక్కన 200 కిలోల మటన్ నుంచి సుమారు 75 కిలోల డ్రై మటన్ తయారు చేయవచ్చు. మార్కెట్లో ఒక కిలో డ్రై మటన్‌కు రూ. 3,000 నుంచి రూ. 3,500 వరకు ధర ఉంది. ఈ బిజినెస్‌ను ఆన్‌లైన్‌ ద్వారా కూడా విస్తరించవచ్చు. ఇలా పరిశుభ్రంగా, నాణ్యతతో తయారుచేసిన డ్రై మటన్‌ను బ్రాండింగ్ ద్వారా ప్రమోట్ చేస్తే, కస్టమర్లు నమ్మకంతో కొనుగోలు చేస్తారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తెచ్చే అవకాశమున్న ఈ బిజినెస్‌ను యువత ప్రయత్నించవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది