Lord Ganesh | పూజలు అందుకోకుండానే గణేషుని నిమజ్జనం.. అలా ఎందుకు చేశారంటే..!
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు విగ్రహం పడిపోవడంతో అది కొంత ధ్వంసం కావడంతో నిర్వాహకులు హుటాహుటిన నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

#image_title
తప్పిన ప్రమాదం..
వివరాల్లోకి వెళ్తే, దోమలగూడ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు సోమవారం ఘట్‌కేసర్‌లో ఓ భారీ గణేశ్ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఆ విగ్రహాన్ని ట్రక్కులో ఓ అపార్ట్‌మెంట్ మండపానికి తీసుకువస్తుండగా, హిమాయత్‌నగర్ వీధి నం.5లో మలుపు వద్ద ఓ కేబుల్ వైరుకు తగలడం వల్ల విగ్రహం ట్రక్కు మీద నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో విగ్రహం కొన్ని భాగాలు పగిలిపోయాయి. దీంతో నిర్వాహకులు పీపుల్స్ ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
ఈ ఘటనలో వాహనంపై ఉన్న బీహార్‌కు చెందిన గోల్‌మార్ (25) అనే యువకుడు కింద పడిపోయి ఎడమ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా, మూడు ద్విచక్ర వాహనాలు కూడా ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి.ఈ ఘటనతో గణేశ్ ఉత్సవాల సందర్భంగా భారీ విగ్రహాలను తరలించే సమయంలో శ్రద్ధతో ప్రణాళికలు, భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరోసారి రుజువైంది. రద్దీ ప్రాంతాల్లో కేబుల్‌లు, విద్యుత్ తీగలు వంటి అవాంతరాలను ముందుగానే గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు