అబ్బో గంటా రాజకీయం.. అంతు చిక్కటం కష్టమే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

అబ్బో గంటా రాజకీయం.. అంతు చిక్కటం కష్టమే

గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన నేత, అయితే గెలిచిన నాటి నుండి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. చాలా సార్లు ఆయన టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీ కండువా కప్పుకోబోతున్నాడు అనే మాటలు కూడా వినవచ్చాయి, అందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నాడు అని కూడా అన్నారు, కానీ ఏమి జరిగింది ఏమో కానీ, గంటా ఎంట్రీకి వైసీపీ డోర్స్ ఓపెన్ కాలేదు. దీనితో తటస్తంగా వుంటూ వస్తున్నాడు. విశాఖ […]

 Authored By brahma | The Telugu News | Updated on :22 February 2021,8:58 am

గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన నేత, అయితే గెలిచిన నాటి నుండి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. చాలా సార్లు ఆయన టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీ కండువా కప్పుకోబోతున్నాడు అనే మాటలు కూడా వినవచ్చాయి, అందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నాడు అని కూడా అన్నారు, కానీ ఏమి జరిగింది ఏమో కానీ, గంటా ఎంట్రీకి వైసీపీ డోర్స్ ఓపెన్ కాలేదు. దీనితో తటస్తంగా వుంటూ వస్తున్నాడు.

Ganta Srinivasa rao political career in dailama

విశాఖ ఉక్కు విషయంలో మోగిన గంటా

విశాఖకు గుండె కాయలాంటి స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల యావత్తు ఆంధ్ర రాష్ట్రము భగ్గుమంటుంది. ముఖ్యంగా విశాఖ వాసులు రగిలిపోతున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సమయంలో గంటా ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం ఏమి చేయటానికైన సిద్దమే అంటూ ప్రకటించాడు. గంటా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ గురి చేసిందనే చెప్పాలి. నిజానికి టీడీపీ పార్టీ విశాఖ ఉక్కు విషయంలో రాజీనామా విషయంలో సానుకూలంగా లేదని తెలుస్తుంది. రాజీనామాలు చేస్తే మళ్ళి ఉప ఎన్నికలు జరిగితే అందులో ఏమయినా తేడా కొడితే దాని ప్రభావం వచ్చే ఎన్నికల మీద పడుతుందని భావించి తమ ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా చేయటానికి వీలులేదని బాబు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే దానికి వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయటంతో ఆయన టీడీపీ కి రెబల్ గా మారిపోయాడేమో అని అనుకున్నారు.

మారిన గంటా వ్యూహం

తాజాగా ఇప్పుడు విశాఖ మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర రాజధానిగా చెప్పుకునే విశాఖ మేయర్ పీఠం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగినది, దీనితో అటు అధికార వైసీపీ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎలాగైనా మేయర్ పీఠంపై తమ జెండా ఎగురవేయాలని చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ తో అంటి ముట్టనట్లు ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు ఇపుడు మళ్ళీ హఠాత్తుగా టీడీపీ ఎమ్మెల్యే అవతారం ఎత్తేశారు. తన ఉత్తర నియోజకవర్గం నుంచి జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్పోరేటర్ అభ్యర్ధులతో సమావేశాన్ని నిర్వహిస్తూ బాగా బిజీ అయిపోయారు.జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాలంటూ గంటా పిలుపు ఇస్తున్నారు. మొత్తానికి గంటా రాజీనామా చేసిన తరువాత టీడీపీ పాలిటిక్స్ లో యాక్టివ్ కావడం విశేషం.

 

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది