Garikapati Narasimha Rao : గరికపాటి ని పిచ్చ తిట్లు తిడుతున్న జనం..?

 Authored By siddhu | The Telugu News | Updated on :21 March 2026,5:10 pm

ప్రధానాంశాలు:

  •  Garikapati Narasimha Rao : గరికపాటి ని పిచ్చ తిట్లు తిడుతున్న జనం..?

Garikapati Narasimha Rao : ప్రవచనకర్తగా సమాజంలో ఎంతో గౌరవం ఉన్న గరికపాటి నరసింహారావు ఈ మధ్య తన నోటి దురదతో లేనిపోని చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఆధ్యాత్మిక విషయాలు పక్కన పెట్టి సామాజిక అంశాలపై ఆయన చేస్తున్న వెటకారపు వ్యాఖ్యలు ఇప్పుడు సామాన్యులకు సైతం చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పేద పిల్లల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపాయి. స్కూళ్లలో అన్నం పెట్టడం మానేయాలని, అది కేవలం పిల్లలను చదువుకు దూరం చేస్తుందని ఆయన చెప్పిన తీరు చూస్తుంటే ఆయనకు పేదల ఆకలి కష్టాలు అస్సలు తెలియవా అనే అనుమానం కలుగుతోంది. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనను ఏకిపారేస్తున్నారు.

Garikapati Narasimha Rao : గరికపాటి ని పిచ్చ తిట్లు తిడుతున్న జనం..?

Garikapati Narasimha Rao : గరికపాటి ని పిచ్చ తిట్లు తిడుతున్న జనం..?

Garikapati Narasimha Rao : పేదల ఆకలిపై ఎందుకీ వెటకారం

గరికపాటి గారు మాట్లాడుతూ స్కూల్లో భోజనం పెడితే పిల్లలు చదువుకోకుండా కేవలం అన్నం కోసమే వస్తున్నారని, అది కూడా గుడ్డు పెడితే శోభనం పెళ్లికొడుకులా మంచం ఎక్కి కూర్చుంటారని చాలా అసభ్యంగా మాట్లాడారు. అసలు ఒక ఆధ్యాత్మిక వేత్త నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం ఏంటని జనం మండిపడుతున్నారు. ఎంతో మంది నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లో పౌష్టికాహారం అందించలేక ప్రభుత్వ బడులకు పంపిస్తుంటే, వారి ఆకలిని అవమానించేలా మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. చదువుకోవడానికి బడికి రండి, ఇంటి నుంచే డబ్బా తెచ్చుకోండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? అందరికీ డబ్బాలు తెచ్చుకునే స్తోమత ఉంటే ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని ఎందుకు నడుపుతాయి?

గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి విషయంలో గానీ, పుష్ప సినిమా విషయంలో గానీ గరికపాటి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో ఏదో సర్దిచెప్పుకున్నా ఇప్పుడు మాత్రం ఆయన హద్దులు దాటేశారని జనం భావిస్తున్నారు. భోజనం పెడితే పిల్లలు గాడిద గుడ్లు చదువుతారని ఆయన వాడటం చూస్తుంటే ఆయనకు పేద విద్యార్థులంటే ఎంత చులకన భావమో అర్థమవుతోంది. మధ్యాహ్న భోజనం వల్ల బడికి వచ్చే పిల్లల శాతం పెరిగిందని ఎన్నో సర్వేలు చెబుతుంటే, గరికపాటి మాత్రం దాన్ని తప్పు పట్టడం విడ్డూరంగా ఉంది. అందుకే ఆయనను ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చ తిట్లు తిడుతున్నారు. పండితుడివి అయితే నీ పాండిత్యాన్ని ప్రవచనాలకే పరిమితం చేయి కానీ, ఇలా పేదవాడి కడుపు కొట్టే మాటలు మాట్లాడొద్దని జనం గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఆయన చేసిన ఈ పనికి ఆయన గౌరవం ఆయనే తగ్గించుకున్నట్టు అయిందని అందరూ అనుకుంటున్నారు.

siddhu

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి