Garikipati Narasimha Rao : నోటికి ఒచ్చింది మాట్లాడితే ఇలాగే ఉంటుంది.. అడ్డంగా ఇరుక్కున్న గరికపాటి !!
Garikipati Narasimha Rao : ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు అందరికీ సుపరిచితుడు.. అయితే అందరికీ మంచి మాటలు చెప్పే ఈ వేదాంత గురువు ఇప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పే స్థాయి నుంచి విమర్శలు ఎదుర్కొనే స్థాయికి వచ్చారు. ఇక ఇప్పుడు ఈయన పేరు వార్తల్లో బాగా కనిపిస్తుంది. రామాయణం ,మహాభారతం, భగవద్గీత లోని సూక్తులను , అందరికీ ఉపయోగపడే సలహాలను టీవీ కార్యక్రమాల ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా గరికపాటి నరసింహారావు గారు మానవాళికి తెలియజేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన మాట్లాడే మాటలు కొందరిని కించపరుస్తున్నాయని చెప్పాలి. మొన్నటికి మొన్న విశ్వబ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడారు. ఆ తర్వాత చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసి మరలా వార్తల్లోకి ఎక్కారు.
ఇక ఇప్పుడు మహిళా వస్త్రధారణ ను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేయడంతో పలువురు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అంటూ మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి గరికపాటి మహిళలోకానికి క్షమాపణ చెప్పాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం సన్మానించిన పద్మశ్రీని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరచడంతో పాటు , శ్రీ ద్వేషపూరితంగా ఉన్నాయని, మహిళలపై హింసను ప్రేరేపించేలా ఉన్నాయని , గరికపాటి పై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా హక్కుల సంఘాలు కోరాయి. అయితే గతంలో కూడా గరికపాటి నరసింహారావు గారు నటి అనుష్క అందాల గురించి విమర్శలు ఎదుర్కొన్నారు.
ఆ తర్వాత స్వర్ణకారుల వృత్తిని కించపరుస్తూ మాట్లాడి , మరల తన తప్పు ని తెలుసుకొని క్షమాపణ తెలియజేశారు. ఇక ఇప్పుడు స్త్రి వేషధారణ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం కౌంటర్ సెటైర్ ఇచ్చారు. అలాగే ఈ వ్యాఖ్యలపై ఐసిఎఫ్ మాజీ అధికారి .బి.ఎస్.పి రాష్ట్ర చీఫ్ ఆర్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించి, ఈ అంశంపై గరికపాటి క్షమాపణ చెప్పి ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలంటూ కోరుతున్నారు. అలాగే గరికపాటి నరసింహారావు కు వ్యతిరేకంగా మహిళా సంఘాలకు మద్దతుగా ,సామాజికవేత్తలు రాజకీయవేత్తలు ప్రముఖ సెలబ్రిటీస్ ,వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగా మారింది. మరి గరికపాటి ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.