Home Loan : గుడ్‌న్యూస్.. ఇల్లు కట్టుకునేవారికి కేంద్రం ప్రభుత్వం ఏకంగా 30 లక్షల సాయం..!
ప్రధానాంశాలు:
Home Loan : గుడ్‌న్యూస్.. ఇల్లు కట్టుకునేవారికి కేంద్రం ప్రభుత్వం ఏకంగా 30 లక్షల సాయం..!
Home Loan : బడుగు బలహీన వర్గాల కోసం, నిరుపేద వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఆర్థికంగా వెనకబడిన వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలి అని కలలు కనే వారికి కేంద్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలను సాయంగా అందించే ప్రయత్నాలు చేస్తుంది.
Home Loan : ప్రధానమంత్రి ఆవాస్ యోజన…
ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. మరి ముఖ్యంగా పేద కుటుంబాలు మధ్యతరగతి వాళ్లు ,ఇల్లు కట్టుకోవాలని ఎన్నో రకాలుగా కలలు కంటూ ఉంటారు. ఈ కలను కేవలం కొంతమంది మాత్రమే సహకారం చేసుకోగలరు. మరి కొంతమందికి ఎంత కష్టపడినా ఈ కల కలగానే మిగిలిపోతుంది. ఈ క్రమంలోనే నిరుపేదలు సైతం సొంత ఇల్లు కట్టుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది.ఇక ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 30 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇక ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని నరేంద్ర మోడీ 2015 లో ప్రారంభించగా ఈ పథకం ద్వారా మొత్తం 20 మిలియన్ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ పథకం 2024 చివరి వరకు పొడిగించబడింది.
ఇక ఈ పథకం ద్వారా పేద ప్రజలకు , ఇల్లు నిర్మించుకోవడానికి దాదాపు 30 లక్షలు వరకు అందజేస్తారు.చిరు వ్యాపారస్తులు, దుకాణదారులు, స్వయం ఉపాధి పొందేవారు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ఈ పథకం ద్వారా సహాయం పొందవచ్చు. ఇక ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.30 లక్షల వరకు సబ్సిడీ అందిస్తుంది. ఇక ఈ రుణం 20 ఏళ్ల కాలానికి అందుబాటులో ఉంటుంది. ఈ సబ్సిడీ రూపంలో 2.67 లక్షల వడ్డీని ఆదా చేసుకోవచ్చు.అలాగే ఈ స్కీమ్ ద్వారా రూరల్ ప్రాంతాలలో కాకుండా మెట్రో నాన్ మెట్రో నగరాలలో దాదాపు 35 లక్షల వరకు ఇండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. దీనిలో 30 లక్షల రుణం లభిస్తుంది.
Home Loan : అర్హులు ఎవరంటే…
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రుణాన్ని పొందాలంటే లబ్ధిదారులు కచ్చితంగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. దీనిలో భాగంగా లబ్ధిదారుల ఆదాయం 18 లక్షలు దాటినట్లయితే 12 లక్షల రుణాన్ని పొందగలుగుతారు. అలాగే 18 ఏళ్లు నిండిన వారు,భారతదేశ నివాసం ఉన్నవారు ఈ స్కీమ్ కి అర్హులవుతారు. అలాగే వార్షిక ఆదాయం 3 లక్షలు నుండి 6 లక్షల మధ్య ఉండాలి. రేషన్ కార్డు బిపిఎల్ జాబితాలో తప్పనిసరిగా పేరు ఉండాలి.
Home Loan : దరఖాస్తు ప్రక్రియ…
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. అలాగే జన సేవ కేంద్రం , గ్రామ సేవక్ ద్వారా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. కానీ 2024 సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ఫామ్ ఇంకా ప్రారంభం కాలేదని సమాచారం.
కావలసిన పత్రాలు..
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని పత్రాలు అవసరమవుతాయి. అదేంటంటే..
ఆధార్ కార్డు
పాస్ పోర్ట్ సైజు ఫోటో ,
జాబ్ కార్డు
బ్యాంక్ పాస్ బుక్
స్వచ్ఛభారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్
ఉపయోగంలో ఉన్న ఫోన్ నెంబర్
ఇన్ కమ్ సర్టిఫికెట్.