Ghattamaneni JayaKrishna | మహేష్ అన్న కొడుకుతో రొమాన్స్ చేయబోతున్న రవీనా టాండన్ కూతురు
Ghattamaneni JayaKrishna | ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ నటుడు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ త్వరలో హీరోగా తెరంగేట్రం చేయనున్నారని సమాచారం.ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి చేపట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.

#image_title
అజయ్ భూపతి దర్శకత్వంలో జంటగా!
వైజయంతి మూవీస్, ఆనంద్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్న అవకాశం ఉందని కథనాలు వెల్లడి చేస్తున్నాయి. సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేశారట. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ గుర్తు ఉన్నారా? నటసింహం నందమూరి బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’, కింగ్ అక్కినేని నాగార్జున ‘ఆకాశ వీధిలో’, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో నటించారు. ఇప్పుడు ఆమె కూతురు హీరోయిన్ సినిమాల్లోకి వచ్చింది.
బాలీవుడ్ ఫిల్మ్ ‘ఆజాద్’తో రషా తడానీ కథానాయికగా పరిచయం కాగా, ఆ సినిమాలో అజయ్ దేవగణ్ కుమారుడు అమన్ దేవగణ్ సరసన నటించింది. అందులో పాట వైరల్ కూడా అయ్యింది. ఇప్పుడు రషా తడానీని తెలుగు తెరకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయకృష్ణ తో ఆవిడ నటించనుంది.జయకృష్ణను హీరోగా పరిచయం చేసే బాధ్యతను అజయ్ భూపతి తీసుకున్నారు. అలానే రవీనా తెలుగు సినిమాని కూడా అజయ్ తెరకెక్కించబోతున్నాడు. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.