Rose Petals | గులాబీ రేకులు అందం మాత్రమే కాదు ..ఆరోగ్యానికి కూడా వరం, లాభాలు తెలిసే ఆశ్చర్యపోతారు!
Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో అద్భుత ప్రయోజనాలను అందిస్తాయి. గులాబీ రేకులు తినటం, డ్రింక్ రూపంలో తీసుకోవటం లేదా నూనె, కషాయం రూపంలో ఉపయోగించడం ద్వారా శరీరానికి మరియు చర్మానికి అమోఘమైన లాభాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
#image_title
బరువు తగ్గడంలో అద్భుత ఫలితాలు
రోజూ కొన్ని తాజా గులాబీ రేకులను తినడం ద్వారా ఆకలి తగ్గుతుంది. ఫలితంగా అనవసరంగా తినే అలవాటు తగ్గి బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. గులాబీ రేకుల్లో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
ఒత్తిడి, తలనొప్పి తగ్గించడంలో సహాయం:
గులాబీ రేకుల సువాసన మనసును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. గులాబీ డ్రింక్ లేదా టీ రూపంలో తీసుకుంటే సహజంగా రిలాక్స్ అవ్వొచ్చు.
హృదయ ఆరోగ్యానికి మేలు:
గులాబీ రేకులను బాదంపప్పుతో కలిపి ఉదయం తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గులాబీ కషాయం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చర్మానికి సహజ కాంతి:
గులాబీ రేకుల్లో విటమిన్ A, C, E, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తాయి. యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా, నునుపుగా ఉంచుతాయి.