Petrol Bunk Cheating : ఈ అమ్మాయి పెట్రోల్ బంకులో 4 లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లింది.. కానీ తర్వాత ఏ జరిగిందో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Petrol Bunk Cheating : ఈ అమ్మాయి పెట్రోల్ బంకులో 4 లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లింది.. కానీ తర్వాత ఏ జరిగిందో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :30 April 2023,9:00 am

Petrol Bunk Cheating : పెట్రోల్ బంక్ లో మోసాలు జరగడం కామనే కదా. తాజాగా ఓ అమ్మాయి పెట్రోల్ బంక్ లో జరిగిన మోసాన్ని ఎలా గుర్తించిందో తెలుసుకుందాం రండి. పెట్రోల్ బంక్ కు వెళ్లి 4 లీటర్ల పెట్రోల్ కొట్టించుకుంది. డిస్ ప్లే మీద కూడా ఎన్ని లీటర్ల పెట్రోల్ కొట్టారో కనిపించింది. కానీ.. తన బైక్ లో మాత్రం చుక్క కూడా పెట్రోల్ కొట్టలేదు. ఈ ఘటన ఏపీలోని గుంటూరులో చోటు చేసుకుంది. లక్ష్మీ అనే అమ్మాయి.. పెట్రోల్ కోసం బంక్ కు వెళ్లి 3 లీటర్ల పెట్రోల్ పోయమని చెప్పింది. దీంతో పెట్రోల్ బంక్ వ్యక్తి 4 లీటర్లు పోయించుకోండి.. 50 రూపాయలు తక్కువ అవుతుంది

Here's why petrol pump dealers from 22 states will halt buying on Tuesday

అని చెప్పడంతో 350 కే నాలుగు లీటర్లు వస్తుండటంతో ఓకే అని చెప్పింది.దీంతో ట్యాంక్ లో పెట్రోల్ కొట్టినట్టుగా నటించి అసలు తన స్కూటీలో చుక్క పెట్రోల్ కూడా పోయలేదు. కానీ.. ఆ విషయం తెలియక ఆ యువతి వెళ్తుండగా మధ్యలో తన స్కూటీ ఆగిపోయింది. పెట్రోల్ మీటర్ కూడా చూపించకపోవడంతో పెట్రోల్ పోయలేదు అనుకొని వెంటనే బంక్ కు వెళ్లి ఆ వ్యక్తితో గొడవ పెట్టుకుంది. దీంతో ఆ అబ్బాయి తనతో గొడవపెట్టుకున్నాడు. ఇంతలో బంక్ మేనేజర్ వచ్చి గొడవ ఎందుకు అని.. తను ఇచ్చిన డబ్బులకు సరిపడా పెట్రోల్ పోయించాడు. కానీ.. లక్ష్మీ మాత్రం ఆ విషయాన్ని వదల్లేదు.

girl was cheated in petrol bunk

girl was cheated in petrol bunk

Petrol Bunk Cheating : పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన లక్ష్మీ

తాను డబ్బులు ఇచ్చినా కూడా పెట్రోల్ పోయకపోవడం ఏంటి అని అనుకొని వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చింది లక్ష్మీ. దీంతో పోలీసులు వచ్చి పెట్రోల్ బంక్ ను చెక్ చేశారు. కానీ.. ఎలాంటి టెక్నాలజీ సమస్యలు లేవు. అసలు ఏం జరిగిందని సీసీటీవీ చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. పెట్రోల్ బంక్ లో పని చేసే ఆ వ్యక్తే మోసం చేశాడని తెలియడంతో వెంటనే ఆ పెట్రోల్ బంక్ ను పోలీసులు సీజ్ చేశారు.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది