Good News : రైతులకు శుభవార్త.. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు..!
Good News : ఆంధ్ర ప్రదేశ్ లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నిధులను బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 50. 58 లక్షల మంది రైతులకు రూ. 1,036 కోట్ల రైతు భరోసా సాయం అందనుంది.
ప్రభుత్వం… రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించే దిశగా… ఏటా రూ. 13, 500ను భరోసా సాయం కింద రైతులకు అందిస్తోంది. తాజాగా అందిస్తున్న రూ. 1,036 కోట్లతో కలిపి ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు అందించిన మొత్తంలో వైఎస్సార్ రైతు భరోసా సాయం మాత్రమే రూ. 19,813 కోట్లుగా ఉండటం విశేషం. వైసీపీ ప్రభుత్వం పోయినసారి ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 13,500ను విడతల వారీగా సాయం అందిస్తోంది.
ఇందులో మొదటి విడతగా ఖరీఫ్ పంట వేసే ముందు అంటే మే నెలలో రూ. 7, 500, రెండో విడతగా అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంటకు, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడో విడతగా జనవరిలో రూ. 2,000 చొప్పున ప్రభుత్వం ఈ నగదును నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తోంది.