EPFO : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో వడ్డీ పెరిగే చాన్స్..?
EPFO : పీఎఫ్ ఖాతాదారులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుంది. ఈపీఎఫ్ఓ, సీబీటీ సమావేశాన్ని వచ్చే నెలలలో గౌహతిలో నిర్వహించనున్నారు. ఇందులో 2021-22కు సంబంధించిన పీఎఫ్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ గతేడాది 2020-21లో 8.5 శాతం వడ్డీ చెల్లించారు. ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ రెండు రోజుల్లో సమావేశం కానుంది. ఇందులో ఈపీఎప్ఓ ఆదాయాలపై చర్చించే చాన్స్ ఉంది. దీని బేస్ చేసుకుని వడ్డీ రేట్లను సీబీటీకి సిఫార్సు చేయనున్నారు. గతేడాది మార్చిలో శ్రీనగర్ లో నిర్వహించిన సమావేశంలో సీబీటీ 2020-21కు సంబంధించిన డిపాజిట్లపై 8.5శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది.
ఈ ప్రతిపాదికన ఆర్థిక మంత్రిత్వ శాఖ అందులో తాజాగా ఆమోదం తెలిపింది. సీబీటీ, ఈపీఎఫ్ఓ సమావేశంలో గతేడాది నవంబర్ లో నిర్వహించారు. కానీ దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.పీఎఫ్ లోని డిపాజిట్లపై జమ చేసిన సొమ్మపై ప్రస్తుతం 8.5 వడ్డీ ఇస్తున్నారు. కానీ గతంతో పోలిస్తే ఇది తక్కువే. ఏడు సంవత్సరాలతో పోల్చితే ఇది తక్కువ. మరి ఈ సమావేశంలో వడ్డీ రేటును ఎంత నిర్ణయిస్తారనేది సస్పెన్స్. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకునే వారు తమ ఫోన్ నుంచి తెలుసుకోవచ్చు.
కేవలం EPFOHO UAN LAN అని టైప్ చేసి రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ఎస్ఎంఎస్ చేయాలి. ఇలా కాకుండా 011-22901406 నంబర్ మిస్ట్ కాల్ ఇవ్వడం వల్ల కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే బ్యాలన్స్ చెక్ చేసుకోవాలనుకునే వారు చాలా మంది పీఎఫ్ ఆఫీస్ లోనే ఎంక్వైరీ చేసుకుంటారు. కానీ ఈ నంబర్ల వల్ల కలిగే ప్రయోజనాలపై ఖాతాదారులకు మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. దీని వల్ల ఖాతాదారులకు ఇబ్బందులు తప్పుతాయి.