Good News : కొత్త ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఆ పథక ప్రయోజనాలు పొడిగింపు..
Good News : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) కొత్త ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే..ఏబీఆర్ వై కింద కొత్త ఉద్యోగులకు రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.ఈపీఎఫ్ ఓ ట్విట్టర్ పోస్టు ప్రకారం.. రిజిస్ట్రేషన్ సౌకర్యం మార్చి 31 వరకు పొడిగించారు.
ఇంతకుముందు ఈ రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూన్ 30, 2021 వరకు ఉండేది. అయితే, ఇప్పుడు అది ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. లేబర్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్ సైట్‌కు లాగిన్ అయిన తర్వాత ABRY గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి కల్పనను పెంచడానికి, సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు
Good News : ఉపాధి నష్టం పూడ్చడానికి ఏబీఆర్‌వై..
కొత్త ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి, ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజీలో భాగంగా ఏబీఆర్ వై ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ సంప్రదించండి..ఈపీఎఫ్ చట్టం 1952 కింద కొత్త ఉద్యోగులు, కొత్త సంస్థలు 31 మార్చి 2022 వరకు నమోదు చేసుకోవడానికి అర్హులు. మరింత సమాచారం కోసం అధికారిక ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ ను సంప్రదించండి.