Tax Deductions : తొలిసారి ఇల్లు కొనేవారికి మంచి ఆఫర్.. రూ.5 లక్షల వరకు పన్ను రాయితీ..
Tax Deductions : తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలని దాదాపుగా ప్రతీ ఒక్కరు కలలు కంటుంటారు. ఆ కల సాకారం చేసుకునేందుకుగాను అహర్నిశలు కష్టపడుతుంటారు కూడా. అందుకు అవసరమయ్యే డబ్బును పోగు చేసుకుని సొంతిళ్లు కట్టుకోవాలని అనుకుంటారు. అందుకుగాను అవసరమయితే హోంలోన్ తీసుకుంటారు. అలా హోం లోన్ తీసుకునే వారికి ఒక శుభవార్త.. ఏమిటంటే.. తొలిసారి ఇళ్లు కొనే వారికి లేదా కట్టుకునే వారికి పన్ను మినహాయింపుల కింద మొత్తంగా లోన్ రూ.5 లక్షలు రాయితీ పొందొచ్చు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
గృహరుణం తీసుకునే వారికి ఆదాయ పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల ద్వారా రూ.5 లక్షల వరకు విలువైన పన్ను మినహాయింపులను ఇస్తున్నది.
ఆదాయ పన్ను చటట్టం ప్రకారం ఆ సెక్షన్స్ ద్వారా గృహరుణాలపై మీరు పన్ను మినహాయింపు పొందవచ్చును. అయితే, ఈ మినహాయింపులు కేవలం తొలిసారిగా ఇల్లు కొనేవారికి లేదా నిర్మించుకునేవారికి మాత్రమేనన్న సంగతి గుర్తెరగాలి. ఇందుకుగాను ట్యాక్స్ డిడక్షన్స్ ఎలా జరుగుతాయంటే.. రుణం తీసుకున్న వారు సెక్షన్ 8 సీ ప్రకారం హోంలోన్ ప్రిన్సపల్ రీ పేమెంట్ పైన రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చును. అయితే, ఇందుకుగాను రుణం తీసుకున్న వారు ఆర్ బీఐ పరిధిలోని సంస్థలోనుంచి మాత్రమే రుణం తీసుకుని ఉండాలి. అయితే, ఇల్లు నిర్మాణంలో ఉన్నంత వరకు ఈ మినహాయింపు వర్తించదు. ఈ సెక్షన్ ద్వారా మీ క్లెయిమ్ 5 ఏళ్లలోగా మీ ఇంటిని విక్రయిస్తే, రిబేట్ అయి మీ ఆదాయానికి యాడ్ అవుతుంది.
Tax Deductions : రాయితీని ఎలా పొందాలంటే..
అయితే, అప్పుడు మినహాయింపు కోసం క్లెయిమ్ చేసిన ఆదాయానికి మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీపైన కూడా మీకు మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 24 ప్రకారం.. గృహరుణ వడ్డీపై రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80 ఈఈఏ ప్రకారం..వడ్డీపై మరో రూ.1.5 లక్షల వరకు అదనపు మినహాయింపు కూడా పొందవచ్చు. ఇది సెక్షన్ 24కి అదనంగా మినహాయింపు ప్రయోజనాలు అందిస్తుంది. ఈ నిబంధనను యూనియన్ బడ్జెట్ 2019లో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే, ఈ మినహాయింపునకు అనేక షరతులు అయితే ఉంటాయి. వాటిని మీట్ అయినప్పుడే ఈ క్లెయిమ్ మీకు లభిస్తుంది.