Jobs Notification : బీఈడీ ఉత్తీర్ణులకు శుభవార్త.. ఆర్మీ స్కూల్స్లో 8700 ఖాళీలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jobs Notification : బీఈడీ ఉత్తీర్ణులకు శుభవార్త.. ఆర్మీ స్కూల్స్లో 8700 ఖాళీలు

 Authored By keshava | The Telugu News | Updated on :12 January 2022,7:40 am

jobs Notification : దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో 8700 టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించే ‘ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్-2022’ ప్రకటన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ పాఠశాలలన్నీ సీబీఎస్ఈ అఫిలియేషన్స్తో నడుస్తున్నాయి.
రాష్ట్రంలో ఆర్మీ స్కూల్స్
ఆర్మీ పబ్లిక్ స్కూల్ : గోల్కొండ, సికింద్రాబాద్ (ఆర్కే పురం), బొల్లారం.
ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్- 2022
మొత్తం ఖాళీలు: 8700 (సుమారుగా)
పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్టీ
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ?

పీజీటీ: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత.
టీజీటీ: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత.
పీఆర్టీ: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ-డీ/రెండేండ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.
వయస్సు: 2021, ఏప్రిల్ 1నాటికి ఫ్రెషర్స్కు 40 ఏండ్లు మించరాదు. అనుభవం ఉన్నవారికి 57 ఏండ్లు మించరాదు. (గత 10 ఏండ్లలో కనీసం 5 ఏండ్లు టీచింగ్లో అనుభవం ఉండాలి)నోట్క్- టీజీటీ/పీఆర్టీ పోస్టులకు సీటెట్/టెట్ తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. సీటెట్/టెట్ క్వాలిఫై కాని-వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారిని తాత్కా-లిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.

Good News for BeD Jobs in Army Schools

Good News for BeD Jobs in Army Schools

సబ్జెక్టులుపీజీటీ: ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయా-లజీ, బయోటెక్నాలజీ, సైకాలజీ, కామర్స్, కంప్యూ-టర్ సైన్స్ ఇన్ఫర్మాటిక్స్, హోంసైన్స్, ఫిజికల్ ఎడ్యుకే-షన్.
టీజీటీ: ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.
ఎంపిక విధానం: మూడు దశల్లో నిర్వహిస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్: 2022, ఫిబ్రవరి 19, 20.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 2022 జనవరి 28
దరఖాస్తు ఫీజు: రూ.385/-
అడ్మిట్ కార్డులు: ఫిబ్రవరి 10
పరీక్షతేదీలు: ఫిబ్రవరి 19, 20
ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 28
వెబ్సైట్: https://www.awesindia.com

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది