Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఒకేసారి మూడు లాభాలు!
Good News : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డియర్ నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగానే ఆనందకరమైన వార్త. డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిల విడుదలపైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 31శాతం డీఏ పొందుతున్నారు. అదనంగా మరో 3 శాతం డీఏ పెరగనుందని సమాచారం. ఇది 2022 జనవరికి సంబంధిన డీఏ అని తెలుస్తోంది. త తాజా పెంపుతో 34 శాతం పెరగనుంది. జనవరి 26న దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Good News : డీఏ, హెచ్‌ఆర్ఏ పెంపుపై ప్రకటన..
కేంద్రం ప్రతిఏటా ఉద్యోగులకు రెండు సార్లు డీఏ పెంచుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడు పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ అంటే డీఆర్ కూడా పెరుగుతుంది. డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా వినియోగదారుల ప్రైస్ ఇండెక్స్ (AICPI)డేటాను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ డేటా ప్రకారం 3 శాతం లేదా 4 శాతం డీఏ పెంచుతుంది. గతంలో పెరిగిన డీఏ వివరాలు చూస్తే 2020 జూలై డీఏ 3 శాతం, 2021 జనవరి డీఏ 4 శాతం, 2021 జూలై డీఏ 3 శాతం చొప్పున పెరిగింది. 2022లో డీఏ 3 శాతం పెరుగుతుందని అంచనా.. అదే జరిగితే 31 ఉన్న డీఏ 34 శాతానికి పెరుగుతుంది.
2021 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం, 18 శాతం, 9 శాతం హెచ్ఆర్ఏ అలవెన్స్ ను కేంద్రం ప్రకటించింది. ఈ శ్లాబ్స్ ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి మారుతుంది. డీఏ, హెచ్ ఆర్ఏతో పాటు పెండింగ్ డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు , పెన్షనర్లకు 2020 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం డీఏ, డీఆర్, 2020 జూలై నుంచి డిసెంబర్ వరకు 3 శాతం డీఏ, డీఆర్ 2021 జనవరి నుంచి జూలై వరకు 4 శాతం డీఏ, డీఆర్ బకాయిలు రావాల్సి ఉంది. డీఏ బకాయిల పైన కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. మొత్తంగా రూ.34,402 కోట్ల బకాయిలు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల అకౌంట్లో జమకానున్నాయి.