Salary Hike : సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేతనాలు భారీగా పెంపు.. !
Salary Hike : సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వేతనాలను భారీగా పెంచేందుకు కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోఈ నిర్ణయం తీసుకోవడం వలన తమ ప్రభుత్వానికి మేలు జరుగుతుందని కేంద్రంలోని పెద్దలు భావించినట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మినిమమ్ బేసిక్ శాలరీని పెంచేందుకు కేంద్రం ఆలోచిస్తుందట.. ప్రస్తుతం 18 వేలుగా ఉన్న బేసిక్ వేతనాన్ని త్వరలోనే 26 వేలు చేయనుందని విశ్వసనీయ సమాచారంగా జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంతా సవ్యంగా జరిగితే వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఈ అంశాన్ని చేర్చనున్నారు. కేంద్రం నిర్ణయంతో అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ పెరగడంతో ఉద్యోగులకు వేతనం కూడా పెరుగుతుంది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రతినిధులతో ఉద్యోగ సంస్థలు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాయట..
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఫిట్‌మెంట్ పెంచేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుండగా.. దీనిపై ఉత్తర్వులు వెలువడితే మినిమమ్ బేసిక్ శాలరీ రూ.18వేల నుంచి రూ.26 వేలకు పెరుగుతుంది. వార్షిక బడ్జెట్‌కు ముందే కేబినెట్ ముందుకు ఈ ప్రతిపాదన రానుంది. దీనికి మంత్రివర్గం ఆమోదం చెబితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మినిమమ్ బేసిక్ శాలరీ పెరగనుంది. ఫిట్‌మెంట్‌ను 2.57 నుంచి 3.68 శాతానికి పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
Salary Hike : ఫిట్‌మెంట్ పై మోడీ ప్రభుత్వం సానుకూలం?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ప్రస్తుతం ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. కేంద్ర కేబినెట్ నుంచి ఫిట్‌మెంట్ పెంపుపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆమోదం లభించనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.కేబినెట్ ఆమోదం తెలిపాక ఫిటిమెంట్ పెంపు భారాన్ని కేంద్ర ప్రభుత్వ ఖర్చుల్లో చూపించనున్నారు. కాగా, వేతనం పెరిగితే అన్ని అలవెన్స్‌లు కూడా పెరగనున్నట్టు సమాచారం. బేసిక్ వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరిగితే, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) కూడా పెరుగుతుంది. బేసిక్ వేతనంలో డియర్‌నెస్ అలవెన్స్ 31 శాతం ఉంటుంది. బేసిక్ వేతనం పెరిగితే, డియర్‌నెస్ అలవెన్స్ కూడా ఆటోమేటిక్‌గా పెరగనుందని తెలుస్తోంది.