Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపే మీ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను అందించింది. రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలనే ఉద్దేశంతో, రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం భారీ సన్నాహాలు చేసింది. గతేడాది తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈసారి ఏకంగా రూ.10 వేల కోట్ల నిధులను సిద్ధం చేసింది. ఇవాళ ఆదివారం కావడంతో నిధుల విడుదల జరగనప్పటికీ, సోమవారం నుంచే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతున్న నేపథ్యంలో రైతులకు ఒక్కో ఎకరానికి రూ.6,000 చొప్పున ప్రభుత్వం నేరుగా డబ్బులు పంపించనుంది. ముందుగా నాలుగు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు డబ్బులు జమ చేయనున్నారు. అంటే గరిష్టంగా ఒక్క రైతుకు రూ.24,000 వరకు లభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రైతులతో ప్రత్యక్షంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 1500 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే సమయంలో నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపే మీ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు
గతంలో నాలుగు ఎకరాల లోపు రైతులకు తొలి విడతగా నిధులు విడుదల చేయగా, ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. అలాగే, కొత్తగా పాస్‌బుక్ తీసుకున్న రైతులను కూడా లబ్దిదారుల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు రైతులకు అందుతున్న సమాచారం ప్రకారం, సోమవారం నాటికి డబ్బులు ఖాతాల్లోకి చేరే అవకాశం ఉంది. ఈ నిధులతో రైతులు వానాకాలం పంటల సాగుకు అవసరమైన ఖర్చులు చేసుకునేందుకు సహాయపడుతుంది. రైతులపై ఆర్థిక భారం తగ్గిస్తూ వ్యవసాయం అభివృద్ధి దిశగా సాగిపోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.