SBI : ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ .. ఇకపై ఫ్రీగా లోన్ ..!!
SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై లోన్ తీసుకోవాలనుకునే వారికి సూపర్ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. దీంతో బ్యాక్ నుంచి రుణం తీసుకోవాలనుకునే వారికి ప్రయోజనం కలుగుతుంది. అయితే ఎస్బిఐ హోమ్ లోన్ తీసుకోవాలి అనుకునే వారికి ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా హోమ్ లోన్ పొందొచ్చని తెలిపింది. ఈ విషయాన్ని ఎస్బిఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలనుకునే వారికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎస్బిఐ తక్కువ వడ్డీ రేటుకి హోమ్ లోన్స్ అందిస్తోంది.
ప్రస్తుతం వడ్డీ రేటు 8.5% నుంచి ప్రారంభమవుతుంది.ఇతర బ్యాంకులతో పోలిస్తే ఇది చాలా తక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఎక్కువ వడ్డీకి హోమ్ లోన్స్ అందిస్తున్నాయి. ఆర్బీఐ రేపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు వరుస పెట్టి రుణం రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి. ఇంకా బ్యాంకు సోలార్ రూఫ్ టాప్ ఫైనాన్స్ సదుపాయం కూడా అందుబాటులో వచ్చింది. అలాగే ఎటువంటి ఛార్జీలు లేవని తెలిపింది. ఎస్బిఐ టైప్ అఫ్ ప్రాజెక్టులకు అయితే కేవలం ఐదు రోజుల్లో అందిస్తుంది. హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారు ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో లోన్స్
పై వడ్డీ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ఆర్బీఐ మరోసారి రేపో రేటును పెంచవచ్చని తెలుస్తుంది. ఎస్బిఐ హోమ్ లోన్ పొందాలని అనుకునేవారు బ్యాంక్ వెబ్సైట్ కి వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఆర్బిఐ వడ్డీ రేటును ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా హోమ్ లోన్ పొందాలనుకుంటే బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎస్బిఐ 8.5% వడ్డీ రేటును అందిస్తోంది. కొన్ని బ్యాంకులు ఇంతకంటే ఎక్కువ వడ్డీ రేటు అందిస్తున్నాయి. ఆర్.బి.ఐ రెపో రేటు నేపథ్యంలో బ్యాంకులు వడ్డీ రేటును పెంచుకుంటూ పోతున్నాయి.