Good News : చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది నుంచి ఈ సేవలు ప్రారంభం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది నుంచి ఈ సేవలు ప్రారంభం..!

Good News : దేశవ్యాప్తంగా ఉన్న చెరువు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలియజేసింది. ఈ ఏడాది నుండి డిజిటల్ లోన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ డిజిటల్ సేవలు ద్వారా చిరు, విధి వ్యాపారులకు.. భారీ ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి వైష్ణవ్.. డిజిటల్ పేమెంట్స్ ఫెస్టివల్ లో ప్రసంగిస్తూ యూపీఐ సర్వీస్.. మాదిరిగానే దీన్ని కూడా […]

 Authored By sekhar | The Telugu News | Updated on :10 February 2023,4:00 pm

Good News : దేశవ్యాప్తంగా ఉన్న చెరువు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలియజేసింది. ఈ ఏడాది నుండి డిజిటల్ లోన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ డిజిటల్ సేవలు ద్వారా చిరు, విధి వ్యాపారులకు.. భారీ ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి వైష్ణవ్.. డిజిటల్ పేమెంట్స్ ఫెస్టివల్ లో ప్రసంగిస్తూ యూపీఐ సర్వీస్.. మాదిరిగానే దీన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

Good news for small traders

Good news for small traders

ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా డిజన్ లో ఇది ఒక విజయం అని అభివర్ణించారు. ఈ డిజిటల్ లోన్ సర్వీస్ ను… నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాబోయే 10, 12 సంవత్సరాల లో దేశంలో ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. గురువారం నాడు కేంద్ర మంత్రి యూపీఐ కోసం వాయిస్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ నమూనాను ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ… యూపీఐ గ్లోబల్ పేమెంట్ ప్రోడక్ట్ గా మారనుందని స్పష్టం చేశారు.

Good news for small traders

Good news for small traders

ఇందుకోసం ఇప్పటికే పలు దేశాలలో ఎన్సిపిఐ భాగస్వామ్యం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. యూపీఐ లావాదేవీలు స్థానిక భాషల్లో తీసుకురావడానికి మిషన్ భాషను జాతీయ భాష అనువాద మిషన్, డిజిటల్ పేమెంట్స్ కలిసి వచ్చాయని స్పష్టం చేశారు. సామాన్యుడు తన స్థానిక భాష ఇంటర్ ఫేస్ వాయిస్ ద్వారా చెల్లింపులు చేయటానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. దేశంలో 18 భాషల్లో మాట్లాడటం ద్వారా ఎవరైనా చెల్లింపులు జరపవచ్చు. డిజిటల్ క్రెడిట్ లో ఇది ఒక గొప్ప విజయమని పేర్కొన్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది