Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి కానుకగా 75 వేల మందికి ఉద్యోగాలు…!
Good News : దీపావళి పండుగ కొద్ది రోజుల్లోనే రానుంది. అయితే మోడీ ప్రభుత్వం దీపావళి కానుకగా యువతకు ఓ శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 75 వేల మంది యువతలకు ప్రధాని నరేంద్ర మోడీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. దీపావళికి రెండు రోజుల ముందు నియామక పత్రాలను అందజేయరన్నారు. రెండు రోజుల ముందు అంటే శనివారం రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువతతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని ఉద్యోగాలకు ఎంపికైన 75 వేల మంది యువతకు నియామక పత్రాలను అందజేస్తారని వెల్లడించారు.
పోస్టల్, హోమ్, రక్షణ రైల్వే, కార్మిక మరియు ఉపాధి శాఖలతోపాటు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిబిఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ సహా పలు విభాగాల్లో ఎంపికైనా వారికి ప్రధాని నరేంద్ర మోడీ పోస్టింగ్ ఇవ్వనున్నారు. శనివారం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. గుజరాత్ నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ, చండీగఢ్ నుంచి కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, జార్ఖండ్ నుంచి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ ముండా ఈ కార్యక్రమంల్లో పాల్గొనబోతున్నారు.
అలాగే ఒడిశా నుంచి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మహారాష్ట్ర నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్, ఉత్తరప్రదేశ్ నుంచి భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర పాండే, రాజస్థాన్ నుంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, తమిళనాడు నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, బీహార్ నుంచి కేంద్రం పంచాయతీరాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్, జార్ఖండ్ నుంచి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాల్గొనబోతున్నారు. దీపావళి కానుక యువతకు నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఏకంగా 75 వేల మంది ఉద్యోగులకు నియామక పత్రాలను నరేంద్ర మోడీ అందజేయనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.