Volunteers Salaries: వాలంటీర్లకు గుడ్ న్యూస్.. జీతాలు డబుల్ చేస్తున్న సీఎం జగన్..!
Volunteers Salaries: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ పెద్ద పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఈ వ్యవస్థ ప్రభుత్వానికి సంబంధించి అనేక పథకాలు మరియు పనులు ప్రజలకు దగ్గరుండి చేసి పెడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిది లాగ పని చేస్తున్నారు.
ప్రతి నెల మొదటి తారీకు నాడు పింఛన్లు ఇవ్వడంతో పాటు.. ఇంకా అనేక ప్రజా సమస్యల విషయంలో చొరవ తీసుకుని వాలంటీర్లు తమ విధులు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా ప్రభుత్వంతో పని ఉంది అంటే ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. కానీ సీఎం జగన్ అటువంటి సమస్యలు లేకుండా ప్రజలకు వాలంటీర్ల ద్వారా అనేక పనులు పూర్తయ్యేల వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామాలలో 50 ఇళ్ళు ఇంకా పట్టణాలలో 100 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల వాల్ ఎన్టీఆర్ ల జీతాల తేదీలలో మార్పులు తెచ్చిన జగన్ ప్రభుత్వం త్వరలోనే వారికి జీతాలు కూడా డబల్ చేయాలనీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖతో సీఎం చర్చిస్తున్నట్లు.. జీతాలు ఎంత పెంచాలి ఎప్పటినుంచి పెంచిన జీతం అమలు చేయాలి అనేదానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ₹5,000 జీతాన్ని ₹10000 చేసి సీఎం జగన్ తన పుట్టినరోజు నాడు డిసెంబర్ 21న.. నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు పెరిగిన జీతాలు జనవరి నుంచి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.