Good News : మ‌హిళ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌.. ఖాతాలోకి రూ.50 వేలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : మ‌హిళ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌.. ఖాతాలోకి రూ.50 వేలు

Good News : మహిళల సాధికారతను కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి అనుసుచిత జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) అనే పథకాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఈ పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ పథకంలో మహిళలకు రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఈ పథకం రూపొందించబడింది. ఇందులో SC/ST మహిళలకు రూ.3 లక్షల వరకు డ్వాక్రా పద్ధతిలో రుణం ఇవ్వబడుతుంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 September 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Good News : మ‌హిళ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌.. ఖాతాలోకి రూ.50 వేలు

Good News : మహిళల సాధికారతను కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి అనుసుచిత జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) అనే పథకాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించింది. వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఈ పథకాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ పథకంలో మహిళలకు రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఈ పథకం రూపొందించబడింది. ఇందులో SC/ST మహిళలకు రూ.3 లక్షల వరకు డ్వాక్రా పద్ధతిలో రుణం ఇవ్వబడుతుంది. అర్హత ఉన్న మహిళలు తమ స్థానిక డ్వాక్రా గ్రూప్ లీడర్ లేదా CC ని సంప్రదించి వడ్డీ లేకుండా ఈ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకంలో 50% వరకు సబ్సిడీ అందించబడుతుంది. అంటే మీరు రూ.1 లక్ష రుణం పొందితే రూ.50 వేలే చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీగా అందించబడుతుంది. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల ఉన్న దరఖాస్తుదారులకు రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.షెడ్యూల్డ్ కులాల యువతను నైపుణ్యాల ఆధారంగా క్లస్టర్లుగా ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడం కూడా ఈ పథకం మ‌రో ముఖ్య లక్ష్యం. వ్యవసాయం, పశు సంవర్ధక, మత్స్యకార్యం, ఫుడ్ ప్రాసెసింగ్, మరియు హస్తకళల వంటి రంగాలలో వారు ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి.

Good News మ‌హిళ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌ ఖాతాలోకి రూ50 వేలు

Good News : మ‌హిళ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌.. ఖాతాలోకి రూ.50 వేలు

జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఆసక్తిగల రుణ దరఖాస్తుదారులు పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించి, PM-AJAY యోజన పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది