Good News : మహిళలకు గుడ్‌న్యూస్.. రెండో కాన్పుకు కూడా కేంద్రం నుంచి డబ్బులు?
Pmmvy Scheme : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. పేదల కోసం చాలా పథకాలను అమలు చేస్తోంది. రైతులకు, మహిళలకు ఇలా అనేక రకాలైన కేటగిరీల వారికి పథకాలతో చేయూతను అందిస్తున్నది. మహిళల కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం మాతృ వందన యోజన స్కీం (PMMVY) అమలు చేస్తున్న విషయం తెలిసింది. ఈ స్కీం కింద ఇప్పటి వరకు మొదటి కాన్పునకు మాత్రమే కేంద్రం నుంచి డబ్బులు వచ్చేవి. కానీ ప్రస్తుతం రెండో కాన్పునకు సైతం సాయం అందించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ఈ స్కీం వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు భర్తకు సంబంధించిన ఆధార్ వివరాలను తీసుకుని ఈ స్కీంను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇక మీదట కొన్ని మార్పులు చేస్తుందని కూడా సమాచారం. మారుస్తున్న నిబంధనల ప్రకారం సైతం మహిళలకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పొచ్చు. ఎక్స్‌పెండిచర్ ఫైనాన్స్ కమిటీ చేసిన ప్రతిపాదనల ప్రకారం కేంద్రం ఈ డిసెషన్ తీసుకున్నట్టు టాక్.ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడాదికి సుమారు 51 లక్షల మంది లబ్ధిపొందే చాన్స్ ఉంది. మూడు విడతల్లో ఈ సాయాన్ని అందించనుంది కేంద్రం.
Good News : మూడు విడతలుగా సాయం..
మొదటి విడలతో వెయ్యి రూపాయలు, రెండో విడతలో రెండు వేలు, మూడో విడతలో రెండు వేలు అందించే చాన్స్ ఉంది. ఈ స్కీం గురించిన పూర్తి వివరాలకు దగ్గరలోకి ఆశవర్కర్ ను సంప్రదించండి. ప్రభుత్వ ఉద్యోగులు (కేంద్ర, రాష్ట్ర) చేసే వారికి ఈ స్కీం వర్తించదన్న విషయం తెలిసిందే. ఇక రెండో కాన్పుకు సాయం విషయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కీం గురించి తెలియక చాలా మంది దీనిని మిస్ అవుతున్నారు. గ్రామాల్లో అయితే దీని గురించి పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.