Kisan Drones : రైతులకు గుడ్‌న్యూస్.. ఇక డ్రోన్లతో మందుల పిచికారి..
Kisan Drones : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను, స్కీమ్స్‌ను అమలు చేస్తోంది. పొలాల్లో పురుగుల మందు పిచికారి చేసే విషయంలో మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రోన్ల ద్వారా పురుగుల మంది పిచికారి చేపట్టి రైతులకు కాస్త ఆసరాగా ఉండాలని భావించింది. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఉన్న పొలాల్లో పురుగుల మందును పిచికారి చేసేందుకు 100 కిసాన్ డ్రోన్లను ప్రధాని మోడీ వర్చువల్ పద్దతిలో తాజాగా ప్రారంభించారు. రైతులకు పురుగుల మందు పిచికారిలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
రైతులకు పంట సాగులో పనులు ఈజీగా అయ్యేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే రైతులకు వంద డ్రోన్లను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండేండ్లలో గరుడ ఏరోస్పెస్ కింద సుమారుగా లక్ష మేడిన్ ఇండియా డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.21వ శతాబ్దపు ఆధునిక వ్యవసాయ సౌకర్యాల దిశలో ఇదో కొత్త అధ్యయమన్నారు. ఈ రంగంలో అవకాశాలు అపరిమితంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Kisan Drones : కొత్త అధ్యయం
మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రైతులకు డిజిటల్, హైటెక్ టెక్నాలజీని అందించేందుకు ఈ డ్రోన్లను తీసుకువచ్చినట్టు తెలిపారు. దీని ద్వారా రసాయన రిహిత, సహజ వ్యవసాయాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రోత్సాహం ఆర్థిక మంత్రి బడ్జెట్ సమావేశాల్లో తెలిపారని మోడీ గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం మరిన్న పథకాలను తీసుకువస్తామని ప్రధాని స్పష్టం చేశారు. వ్యవసాయానికి సంబంధించి మరిన్నీ అవసరాలను తీర్చేందుకు కేంద్రం ముందుంటుందని మోడీ తెలిపారు.