Ys jagan : వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన రెండ్రోజులకే కేంద్రం గుడ్ న్యూస్!

Polavaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.320 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిని 2021–22 బడ్జెట్‌లో కేంద్ర జల్‌ శక్తి శాఖకు కేటాయించిన నిధుల నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి విడుదల చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం పీపీఏ అకౌంట్‌లో ఈ నిధులు జమ కానున్నాయి. అనంతరం శుక్రవారం వరకు ఏపీ ఖజానాలో నిధులు యాడ్ కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసి వచ్చిన రెండ్రోజుల్లోనే కేంద్రం ఈ మేరకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పోలవరం పనులు 90 శాతం పూర్తయినట్టు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో భాగంగా నేషనల్ ప్రాజెక్టుగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. 2014 ఏప్రిల్‌ 1న నీటి పారుదల విభాగం ఖర్చు మొత్తాన్ని 100 శాతం రీయింబర్స్‌ చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,372.14 కోట్లు ఖర్చు చేయగా, అందులో 2014 ఏప్రిల్‌ 1 తర్వాత చేసిన వ్యయం రూ.13,641.43 కోట్లుగా ఉంది. కేంద్రం నేటికీ రూ.11,492.16 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇంకా రూ.2,149.27 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. పోలవరం కోసం ఖర్చు చేసిన రూ.2,149.27 కోట్ల బిల్లులను అధికారులు పీపీఏకు సమర్పించారు. ప్రస్తుతం రూ.711.60 కోట్లు రీయింబర్స్‌ చేయాలని పీపీఏ కేంద్ర జల్‌ శక్తి శాఖను కోరగా, దీనికి CWC కూడా ఆమోదం తెలిపింది.

good news is cm Ys jagan has been in delhi for days

Ys jagan : త్వరలోనే మిగతా నిధులు

తొలిదశలో రూ.320 కోట్లను ఆర్థిక శాఖ మంజూరు చేయగా, మిగతా మొత్తాన్ని మంజూరు చేసే విషయంపై పరిశీలిస్తున్నారు. రూ.320 కోట్లు పోగా.. రాష్ట్రం చేసిన ఖర్చులో రూ.1829.27 కోట్లను కేంద్రం తిరిగి ఇవ్వాల్సి ఉంది. సీఎం జగన్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లి 2 రోజుల పాటు ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను నిధుల గురించి చర్చించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ రాష్ట్రానికి వచ్చిన రెండ్రోజుల్లోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Recent Posts

Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టు మంచిదా, కాదా.. పండితుల సూచన ఏంటి?

Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…

9 minutes ago

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

15 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

16 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

16 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

18 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

19 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

20 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

21 hours ago