
latest smart phone from samsung pay rs 999 and get it
New Smartphone : కొత్త ఏడాదిలో శాంసంగ్ కంపెనీ సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. అందుకు సంబంధించి తాజాగా ప్రకటన వెలువడింది. తన గెలాక్సీ సిరీస్‌లో భాగంగా కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. గెలాక్సీ S21 FE 5G పేరుతో ఇది భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. జనవరి 11న అధికారికంగా భారతీయ విపణిలోకి విడుదల అవుతుందని సమాచారం. దీనికి సంబంధించిన ధర మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే, శాంసంగ్ కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్ కోసం రూ.999 టోకెన్ మొత్తాన్ని చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.సరికొత్తగా ఆవిష్కృతం కానున్న ఈ మోడల్‌ను రూ.999 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకున్నవారికి డెలివరీ విషయంలో తొలి ప్రాధాన్యత ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఆయా కస్టమర్లు ఎటువంటి ఎక్స్ ట్రా ఛార్జీలు చెల్లించకుండా రూ. 2,699 విలువైన గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ ట్రాకర్ యాక్సెసరీని ఫ్రీగా దక్కించుకోవచ్చు. శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్‌ను శామ్సంగ్ ఇండియా ఈ-స్టోర్, http://www.samsung.com లేదా శామ్సంగ్ షాప్ యాప్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చును..శాంసంగ్ S21 FE 5G ధర అమెరికా మార్కెట్లో $699 (సుమారు రూ. 52,150) వద్ద ప్రారంభం కానుంది. ఇండియాలో మాత్రం ధర ఎంత ఉంటుందనే విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ 1 ప్లస్ 9RTకి గట్టి పోటీని ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
latest smart phone from samsung pay rs 999 and get it
హై-ఎండ్ ఫీచర్లతో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ 6.4 -అంగుళాల 1080p AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ విషయానొకొస్తే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 5జీ కనెక్టివిటీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 12- ఆధారిత One UI 4.0 ఓఎస్‌పై పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4,500mAh బ్యాటరీని అందించింది. ఇందులో 15W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను చేర్చింది. 12 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో కెమెరా, 30 ఎక్స్ సాఫ్ట్‌వేర్ ప్రేరిత “స్పేస్” జూమ్ కెమెరాలను కలిగి ఉంది.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.