Good News : బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. సేవింగ్స్ అకౌంట్స్‌పై పెరిగిన వడ్డీ రేటు..
Good News : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు తమ డబ్బులను బ్యాంకుల్లోనే దాచుకుంటున్నారు. తమ డబ్బును ఇతరులకు ఇచ్చే బదులుగా బ్యాంకులో తమ అకౌంట్ లో వేసుకుంటే అసలు అయినా మిగులుతుందని కొందరు అనుకుంటున్నారు. ఎందుకంటే వడ్డీకి ఇతరులకు ఇస్తే అసలు, వడ్డీ రెండూ ఎగ్గొడుతున్న సందర్భాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకు ఖాతాదారులు తమ డబ్బులను సేవింగ్స్ అకౌంట్స్ లో సేవ్ చేసుకుంటున్నారు. కాగా, ఈ నేపథ్యంలోనే బ్యాంకు ఖాతాదారులకు బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది.
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వడ్డీ రేటును సవరించింది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ తన అకౌంట్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పై వడ్డీ రేటును సవరించింది. ఈ నూతన వడ్డీ రేటు ఈ నెల 2 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ తన వెబ్ సైట్ లో పేర్కొంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. బ్యాంకు ఇప్పుడు రూ.50 లక్షల కంటే తక్కువ నిల్వ ఉన్న సేవింగ్స్ అకౌంట్స్ పైన ఏడాదికి మూడు శాతం వడ్డీ రేటు ఇస్తోంది.రూ.50 లక్షల కంటే ఎక్కువ, రూ.1,000 కోట్ల కంటే తక్కువ
Good News : ఈ నెల 2 నుంచి కొత్త రేటు అమలులోకి..
ఉన్న సేవింగ్స్ అకౌంట్స్ పై ఏడాదికి 3.50 శాతం వడ్డీ, రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ పొదుపు నిల్వలపై ఏడాదికి 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ ఓ, ఎన్ఆర్ ఈ సేవింగ్స్ అకౌంట్స్ కు కూడా వర్తిస్తాయని బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల కాలంలో జనాల్లో డిజిటల్ అవేర్ నెస్ బాగానే పెరిగింది. ఈ క్రమంలోనే అందరూ ఆన్ లైన్ ట్రాంజాక్షన్స్ కూడా చేస్తున్నారు. సేవింగ్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ఈ మేరకు వడ్డీ రేట్లు పెంచే డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.